Simhachalam: రాజకీయాలకు అతీతంగా ఆలయాల పవిత్రతను కాపాడాలి.. సింహాచలంలో సంప్రోక్షణ..

| Edited By: Surya Kala

Sep 24, 2024 | 9:43 PM

ఇప్పటికే సింహాచలం లడ్డుప్రసాదంలో వినియోగించిన నెయ్యిపై ఎమ్మెల్యే గంట అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడానికి చెందిన రైతు డైరీ నెయ్యి శాంపిల్స్ లో సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కు పంపించారు. అప్పటికే స్టోర్ లో స్టాక్ ఉన్న నెయ్యి డబ్బాలను సీజ్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో సంప్రోక్షణ, శాంతి హోమాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Simhachalam: రాజకీయాలకు అతీతంగా ఆలయాల పవిత్రతను కాపాడాలి.. సింహాచలంలో సంప్రోక్షణ..
Simhadri Appanna Temple
Follow us on

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం దేవస్థానంలో సంప్రోక్షణ నిర్వహించారు. దేవస్థానం అధికారులు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. దేవాలయంలో అర్చక స్వాములు సంప్రోక్షణను పూర్తి చేశారు. సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో జరిగిన సంప్రోక్షణ శాంతి హోమం లో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఇప్పటికే సింహాచలం లడ్డుప్రసాదంలో వినియోగించిన నెయ్యిపై ఎమ్మెల్యే గంట అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడానికి చెందిన రైతు డైరీ నెయ్యి శాంపిల్స్ లో సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కు పంపించారు. అప్పటికే స్టోర్ లో స్టాక్ ఉన్న నెయ్యి డబ్బాలను సీజ్ చేశారు.

సిట్ నిగ్గు తేలుస్తుంది..

గత పాలకుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో సంప్రోక్షణ, శాంతి హోమాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానంలో జరిగిన శాంతి హోమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, గణబాబులతో కలిసి పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రహణాలు వంటివి ఏర్పడినప్పుడు చేసే పూజలు, యాగాలు వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల చేసుకోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. సింహాచలంలోనే జరిగిన యాగానికి కేజీ నెయ్యి 1,400 కు రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసిన అధికారులు, ప్రసాదం తయారీకి వాడే నెయ్యి రివర్స్ టెండరింగ్ లో 344 కు ఏ రకంగా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. సింహాచలం స్టోర్స్ లో రుచి చూసిన నెయ్యి తేడాగా ఉందని ఆరోజే చెప్పానని, నాణ్యత లేని నెయ్యి వాడడం వల్ల ప్రసాదాల రుచి దిగజారిందన్నారు.

ఇవి కూడా చదవండి

పవిత్రమైన దేవాలయాల ప్రసాదాల్లో కల్తీ సరుకులు వాడడం క్షమించరాని నేరమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన సిట్ వీటన్నింటి నిగ్గు తేలుస్తుందని చెప్పారు. సింహాచలం దేవస్థానంలో కల్తీ నెయ్యి వాడినట్టు ల్యాబ్ రిపోర్టులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు కూడా దీక్షలు చేస్తున్నాయన్నారు. దేవాలయాల ప్రతిష్ట కాపాడడానికి రాజకీయాల కతీతంగా కలిసి పని చేయాలని పేర్కొన్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..