అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శబరిమల అయ్యప్ప అలయం తెరుచుకుంది. వార్షిక వేడుకల్లో భాగంగా.. శబరిమల ఆలయాన్ని ఓపెన్ చేశారు దేవాదాయ శాఖ అధికారులు. నేటినుంచి మండల పూజ , మకర జ్యోతి కోసం దర్శనాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో అయ్యప్పను దర్శించుకుంటున్నారు భక్తులు. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి భక్తులు అయ్యప్ప స్వామివారికి దర్శించుకోవడానికి సన్నిధానం, పంబ వద్దకు పెద్దయెత్తున చేరుకున్నారు.
డిసెంబర్ 27న మండల పూజ జరగనుండగా.. నేటి నుంచి ప్రత్యేక పూజలు, నిత్యా నెయ్యాభిషేఖం చేయనున్నారు. డిసెంబర్ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు మకర జ్యోతి పూజలు, 15న సాయంత్రం ఆరున్నర గంటలకు మఖర జ్యోతి దర్శనం ఉంటుంది. ఇక.. శబరిమల ఆలయం తెరుచుకోవడంతో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించాలని ట్రావెన్ కోర్ బోర్డు నిర్ణయించింది.
నిలక్కల్, పంబా వద్ద భక్తులు సన్నిధానంలో రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించి అందుకు వీలుగా వీడియో వాల్‌తో కూడిన డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో శబరిమల వద్ద ఆరు దశల్లో 13000 మంది పోలీసులను మోహరించారు. వృద్ధులు, చిన్నారులకు ‘దర్శనం’ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
మండల దీక్ష కోసం అయ్యప్ప ఆలయాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. డిసెంబర్ 27న మండల దీక్ష సీజన్ ముగియనుంది. మకర సంక్రమణ పండుగ కోసం డిసెంబర్ 30న మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15న మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తుల్ని అయ్యప్ప దర్శనం చేసుకోనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..