AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clothes for Lord Ram: అయోధ్య రామయ్య కోసం అద్భుత వస్త్రాలు..ఏకంగా 12 లక్షల మంది చేతుల మీదుగా తయారైన..

‘శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే)’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యివేసి ఈ వస్త్రాలు నేశారు. ఆ వస్త్రాలను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారికి అందజేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్‌ ట్రస్ట్‌ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్‌ అభినందించారు.

Clothes for Lord Ram: అయోధ్య రామయ్య కోసం అద్భుత వస్త్రాలు..ఏకంగా 12 లక్షల మంది చేతుల మీదుగా తయారైన..
Clothes For Lord Ram
Jyothi Gadda
|

Updated on: Jan 17, 2024 | 11:34 AM

Share

కొత్త అయోధ్యలో ఇకపై కర్ఫ్యూ ఉండదని, దానికి బదులుగా భక్తి సంకీర్తనలు, శ్రీరాముడి పేరిట భక్తిగీతాలు వినిపిస్తాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇకపై అయోధ్యలో బుల్లెట్లు పేల్చబోమని, బదులుగా రామభక్తులకు లడ్డూలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. లక్నోలో హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామ్ లల్లా కోసం ట్రస్ట్ చేత నేసిన వస్త్రాలను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ.. శ్రీరాముని నామం ఉచ్ఛరించకుండా మన దేశంలో ఏ పనీ జరగదని అన్నారు.

ఈ నెల 22న అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్‌ హ్యాండ్‌వీవింగ్‌ రివైవల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ‘శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే)’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యివేసి ఈ వస్త్రాలు నేశారు. ఆ వస్త్రాలను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారికి అందజేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్‌ ట్రస్ట్‌ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్‌ అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!