AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi 2025: సోదరి ఎదురుచూసే రాఖీ పండగ ఈ ఏడాది ఎప్పుడు? రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడంటే..

హిందువులు జరుపుకునే పండగలలో రాఖీ పండగ వెరీ వెరీ స్పెషల్. ఈ పండగను అన్న చెల్లుల ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు. అందుకనే ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఇష్టంగా ఏడాది మొత్తం ఎదురుచూస్తుంది. ఈ నేపధ్యంలో 2025 సంవత్సరంలో అన్నచెల్లెల ప్రేమ పండుగ అయిన రాఖీ పండగ ఏ రోజున జరుపుకోవాలి. శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకోండి.

Rakhi 2025: సోదరి ఎదురుచూసే రాఖీ పండగ ఈ ఏడాది ఎప్పుడు? రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడంటే..
Raksha Bandhan 2025
Surya Kala
|

Updated on: Jun 16, 2025 | 1:29 PM

Share

హిందూ మతంలో సోదర-సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ అన్నదమ్ముల.. అక్కచెల్లెలను ప్రేమ బంధంలో బంధిస్తుంది. ఈ రోజున సోదరీమణులందరూ సోదరుడి మణికట్టుకి రాఖీ కడతారు. తమ సోదరుల నుంచి దీవెనలను తీసుకుంటారు. 2025 సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం..

వేద క్యాలెండర్ ప్రకారం 2025 సంవత్సరంలో రక్షా బంధన్ పండుగను జరుపుకోవడానికి శ్రావణ మాసం పౌర్ణమి తిధి శనివారం, 9 ఆగస్టు 2025న వచ్చింది. ఈ రోజున సోదరీమణులందరూ శుభ సమయంలో తమ సోదరుల మణికట్టుకి రాఖీని కడతారు.

రాఖీ పండగ 2025 తిథి

శ్రావణ మాసం పౌర్ణమి తిధి ఆగస్టు 8, 2025న మధ్యాహ్నం 2:12 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పౌర్ణమి తిధి ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 గంటలకు ముగుస్తుంది.

ఉదయతిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9, శనివారం జరుపుకుంటారు.

రాఖీ కట్టే సమయం ఉదయం 05:56 నుంచి మధ్యాహ్నం 01:24 వరకు ఉంటుంది.

ప్రదోష కాలంలో రాఖీ కట్టే సమయం

రాఖీ పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ రోజు ప్రదోష కాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం సాయంత్రం 7:19 నుంచి రాత్రి 9:24 వరకు.

రాఖీ పౌర్ణమి రోజున భద్ర కాలం ఎప్పుడు?

రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్ర కాలం శుభప్రదంగా పరిగణించబడదు. భద్ర కాలం 2025 ఆగస్టు 9న తెల్లవారుజామున 1:52 గంటలకు ముగుస్తుంది. అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు. కనుక ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 వరకూ రాఖీని కట్టవచ్చు.

ఎందుకంటే భద్ర కాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి. భద్ర కాలం ఉంటే.. ప్రదోష కాలంలో కూడా రాఖీ కట్టవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే