ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు.. విదేశీయులు సైతం పోటెత్తే ఆలయం ఎక్కడంటే

భారతదేశంలో అనేక దేవుళ్ళ, దేవతల ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి చాముండా మాత అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారు తన భక్తులను డేగ రూపంలో రక్షించిందని నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక నమ్మకాల గురించి తెలుసుకుందాం.

ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు.. విదేశీయులు సైతం పోటెత్తే ఆలయం ఎక్కడంటే
Jodhpur Chamunda Mata Mandir
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2024 | 12:02 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక పురాతన, అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ప్రత్యేక నమ్మకాల కారణంగా ప్రాచుర్యం పొందాయి. భారతదేశంలో అమ్మవారికి సంబంధించిన అనేక ఆలయాలున్నాయి. అలాంటి ఒక ఆలయంలో అమ్మవారు డేగ రూపంలో ప్రజలను రక్షిస్తుందని నమ్మకం. ఈ అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని నిర్మలమైన హృదయంతో సందర్శిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

రాజస్తాన్ లోని మెహ్రాన్‌ఘర్ కోటలో కాళికాదేవి పురాతన.. భారీ ఆలయం ఉంది. జోధ్‌పూర్ లోని మెహ్రాన్‌గఢ్ కొండపై ఉన్న జోధ్‌పూర్ కోటపై ఈ ఆలయం నిర్మాణం జరుపుకుంది. సుమారు 561 సంవత్సరాల క్రితం మాండోర్ పరిహార్ల కులదేవిగా.. చాముండా మాత పూజించబడింది.

ఇవి కూడా చదవండి

డేగలా రక్షించిన అమ్మవారు

చాముండా మాతపై ఉన్న అచంచలమైన విశ్వాసమే ఇందుకు కారణమని చెబుతారు. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధంలో జోధ్‌పూర్‌పై బాంబు పడినప్పుడు చాముండా మాత  జోధ్‌పూర్ ప్రజలను డేగలాగా మారి రక్షించిందని నమ్మకం. అంతేకాదు 1857 ఆగస్టు 9న కోటలోని గోపాల్ పోల్ సమీపంలో తుపాకీ మందు కుప్పపై పిడుగు పడిందని చెబుతారు. ఈ సమయంలో ఆలయం బీటలు వారింది. అయినా సరే ఈ ఆలయంలోని విగ్రహానికి గీతలు కూడా పడలేదు. అందుకే జోధ్‌పూర్ ప్రజలు చాముండా మాత జోధ్‌పూర్‌కు రక్షకురాలిగా భావిస్తారు.

కోరికలు నెరవేరుతాయి

చాముండా మాత ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు పోటేత్తుతారు. చాముండా మాత  ప్రధాన ఆలయాన్ని మహారాజా అజిత్ సింగ్ సక్రమంగా నిర్మించారు. మార్వార్ రాథోడ్ వారసులు డేగను దుర్గా దేవి రూపంగా భావిస్తారు. మెహ్రాన్‌గఢ్ కోటపై డేగలు తిరుగుతున్నంత కాలం.. కోటకు ఎటువంటి విపత్తు రాదని అమ్మవారు మార్వార్ వారసులను ఆశీర్వదించిందని నమ్మకం. అంతే కాకుండా ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుందని స్థానిక ప్రజల నమ్మకం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో