AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రేమికుడిపై పగ తీర్చుకునేందుకు సూప్‌లో విషం కలిపిన యువతి.. ఐదుగురు మృతి

తనకు బ్రేకప్ చెప్పిన ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక యువతి సూప్‌లో విషం కలిపినది. దీని ఫలితంగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు పూర్తిగా అంధుడిగా మారాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సంఘటన జనాల్లో చర్చనీయాంశమైంది. ప్రియురాలు తన ప్రేమికుడికి విషమిచ్చిన ఘటన ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం..

Viral News: ప్రేమికుడిపై పగ తీర్చుకునేందుకు సూప్‌లో విషం కలిపిన యువతి.. ఐదుగురు మృతి
Viral News
Surya Kala
|

Updated on: Nov 02, 2024 | 10:55 AM

Share

తరచుగా ఒక వ్యక్తి జీవితంలో ప్రతీకార ఆలోచనలు తలెత్తుతాయి. ఎవరైనా ఏదైనా చెబితే మనసుకు కోపం వస్తుంది. ఎవరైనా చెడు చేస్తే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వచ్చి, అవకాశం వచ్చిన వెంటనే..తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తారు. తరచుగా ఇలా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు ప్రేమలో ఎక్కువగా కనిపిస్తాయి. ఏమి చేస్తున్నామో అర్థం చేసుకోలేనంతగా ప్రతీకార భావనతో అంధుడిగా మారతారు. అటువంటి పరిస్థితిలో ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో పెద్ద తప్పులు చేసేవారు కూడా ఉన్నారు. దీని పర్యవసానాన్ని జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. తన ప్రేమికుడిని హత్య చేసిన తర్వాత మహిళ మరో నలుగురిని చంపింది.

ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. ఎడో స్టేట్ లో ఓ ఇంటి గదిలో 5 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో అసలు నిజం వెలుగులోకి రావడంతో అక్కడున్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐదుగురి మృతికి ఓ యువతి కారణమని చెబుతున్నారు.

అమ్మాయి పగ తీర్చుకుంది ఇలా?

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం.. వాస్తవానికి  16 ఏళ్ల అమ్మాయి ఐషా సులేమాన్‌  ఐదుగురిని చంపాలని కోరుకోలేదు. అయితే ఆమె తన ప్రేమికుడిని మాత్రమే చంపాలనుకుంది. మిగిలిన నలుగురు పొరపాటున చచ్చిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములని, బాలికతో సహా మిగిలిన ముగ్గురు స్నేహితులని తేలింది.

కొద్ది రోజుల క్రితమే ఆ అమ్మాయి బ్రేకప్ అయ్యిందని అంటున్నారు. దీని కారణంగా యువతి చాలా కోపంగా ఉండేది. అంతేకాదు తన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. దీని కోసం ఆమె తన మాజీ ప్రియుడి తాగే నల్ల మిరియాలు సూప్‌లో విషం కలిపింది.

తన స్నేహితులకు సూప్ పంచిన ప్రియుడు

తన సూప్ లో విషం దాగున్న విషయం గురించి ప్రియుడికి తెలియదు. దీంతో అతను తన ఇతర స్నేహితులకి కూడా ఈ సూప్‌ను షేర్ చేశాడు. ఆ తర్వాత ఈ సూప్ తాగిన నలుగురు కూడా చనిపోయారు. దీంతో నైజీరియా ఆర్మీ ఆ యువతిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ చేస్తున్నారు. తానే విషం కలిపినట్లు బాలిక స్వయంగా విచారణలో చెప్పింది. ఎడో స్టేట్ పోలీస్ కమాండ్ ప్రెస్ ఆఫీసర్ మోసెస్ యము మాట్లాడుతూ.. మరణాలు ఎలా సంభవించాయో తెలిసిందని చెప్పారు. అయితే మరణానికి కారణం ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. ఫుడ్ పాయిజన్ కావడం, లేదా జనరేటర్ నుంచి పొగలు రావడం వల్లే మరణానికి కారణమని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..