Rain Water: శ్రావణ మాసంలోని వర్షం నీరు అమృతంతో సమానం.. ఈ నీటితో చేసే పరిహారాలతో అప్పుల సహా అనేక సమస్యల నుంచి విముక్తి.

శ్రావణ మాసంలో భారీ వర్షాలు కురుస్తాయి. సనాతన ధర్మంలో వర్షం నీరుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. వర్షపు నీరు అమృతం కంటే తక్కువ కాదని నమ్ముతారు. ఎవరి ఇంట్లో అయినా సిరి సంపదలు కొలువై ఉండేందుకు అనేక నివారణ చర్యలు కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి. వీటిని అనుసరించడం వలన అప్పులు, కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. తద్వారా శివుని ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు. కనుక ఈ రోజు ఆ నివారణలు ఏమిటో తెలుసుకుందాం.

Rain Water: శ్రావణ మాసంలోని వర్షం నీరు అమృతంతో సమానం.. ఈ నీటితో చేసే పరిహారాలతో అప్పుల సహా అనేక సమస్యల నుంచి విముక్తి.
Rain Water Remedies

Updated on: Jul 22, 2025 | 11:36 AM

శ్రావణ మాసంలోని ప్రకృతి అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అని అంటారు. వర్షపు చినుకులు ప్రకృతిని పులకరిస్తాయి. నేల,మొక్కలు కొత్త జీవితాన్ని పొందుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసంలో కురిసే వర్షం నీరు అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. అనేక సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. ఈ నీటిని అమృతం లాంటిదిగా భావిస్తారు. దీనిని భగవంతుని దయగా భావిస్తారు.

శతాబ్దాలుగా శ్రావణ మాసంలో కురిసే వర్షం నీటిలో స్నానం చేయాలని పెద్దలు సలహా ఇస్తున్నారు. దీని వెనుక అనేక ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఈ నీటికి సంబంధించిన అనేక నివారణలు జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం చేస్తాయి. మనిషి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం వర్షపు నీటి గురించి అనేక నివారణలు చెప్పబడ్డాయి. వర్షపు నీరు అదృష్టాన్ని మార్చగలదని నమ్ముతారు. ఇల్లు సంపదతో నిండిపోవచ్చు, అప్పుల నుంచి విముక్తి పొందవచ్చు, వివాహ సమస్యను పరిష్కరించవచ్చు, అనేక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. కనుక వర్షం నీరుతో చేసే ఆ నివారణలు ఏమిటో తెలుసుకుందాం.

వర్షపు నీటితో రుణ విముక్తికి పరిష్కారం
వర్షపు నీటిని సేకరించి అందులో పచ్చి పాలు కలిపి.. ఆ నీటితో స్నానం చేయడం వలన త్వరలోనే అప్పుల నుంచి అపశమనం లభిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

వర్షపు నీటితో శివుడిని సంతోషపెట్టండి
శ్రావణ మాసంలో శివుడిని పూజించే వారికి శివుడి ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి రోజూ వర్షపు నీటిని శుభ్రమైన కాగితంలో సేకరించి శివుడికి సమర్పించండి. ఈ నీటితో జలాభిషేకం చేయడం ద్వారా, వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని, శివుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

వ్యాపారంలో లాభానికి వర్ష నీటి నివారణలు
ఎవరైనా తమ వ్యాపారంలో పురోగతి, అభివృద్ధి కావాలంటే.. వర్షపు నీటిని సేకరించి శ్రీ మహా విష్ణువు,లక్ష్మీ దేవికి సమర్పించండి. ఇది మీ వ్యాపారాన్ని రోజురోజుకూ పెంచుతుంది.

వివాహ సమస్యల నుంచి బయట పడేందుకు
ఈ నీటిని సేకరించి నిల్వ చేసుకుంటే..వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు లేదా వైవాహిక జీవితం సంతోషంగా లేనివారు ఈ నీటితో స్నానం చేయాలి. ఈ నీటిని గణేశుడికి సమర్పించాలని నమ్ముతారు. ఈ పరిహారం వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తుందని నమ్ముతారు.

ఆర్థిక సంక్షోభం అధిగమించేందుకు వర్షపు నీటి పరిష్కారం
ఒక చిన్న గాజు సీసాలో వర్షపు నీటిని రెండు లవంగాలతో కలిపి సేఫ్‌లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది.

శ్రావణ మాసంలో వర్షం నీటిలో దేవుని విగ్రహాలను స్నానం చేయండి
ఎవరైనా శ్రావణ మాసంలోని వర్షం నీటిని ఏడాది పొడవునా నిల్వ చేయవచ్చు. ఈ నీటితో దేవుని విగ్రహాలకు అప్పుడప్పుడు స్నానం చేయిస్తే.. అది మీ ఇంట్లో అదృష్టం, సంపదను పెంచుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.