Pushpa Yagam: శ్రీవారి పుష్పయాగానికి ముహర్తం ఖరారు.. ఈ నెల 10 వ తేదీన ఆర్జిత సేవ టికెట్స్ రిలీజ్

|

Oct 08, 2022 | 10:42 AM

15వ శతాబ్దం కాలం నుంచి శ్రీవారికి  ఈ పుష్పయాగ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ..

Pushpa Yagam: శ్రీవారి పుష్పయాగానికి ముహర్తం ఖరారు.. ఈ నెల 10 వ తేదీన ఆర్జిత సేవ టికెట్స్ రిలీజ్
Srivari Pushpayagam
Follow us on

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఈ క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతోంది. పండగలు, పర్వదినాలు, నిత్య పూజలతో సందడిగా ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత మళ్ళీ భక్తులకు కనువిందు చేయడానికి పుష్పయాగ మహోత్సవం రెడీ అవుతోంది. ఏటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1 వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పుష్పయాగం టిక్కెట్లు ఈ నెల 10 వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో  రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆర్జిత సేవ టిక్కెట్ ఖరీదు రూ. 700/- స్వామివారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పుష్పయాగం నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి పంపుతారు. జయ విజయుల దగ్గర నుండి స్వామి దర్శనం ఉంటుంది.

15వ శతాబ్దం కాలం నుంచి శ్రీవారికి  ఈ పుష్పయాగ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారికి హృదయాన్ని తాకేవరకు పలుమార్లు పుష్పార్చన చేస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటూ కర్ణాటక నుంచి సుమారుగా ఏడు టన్నుల పూలను దాతలు విరాళంగా పంపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..