Dakshin Kashi: బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం.. పవిత్ర పుష్కరిణి.. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ’గా పిలుస్తారు ఎందుకో తెలుసా

|

Mar 05, 2024 | 1:01 PM

రాజు కలలో కనిపించిన శివుడు అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించమని రాజును కోరాడు. రాజు అతని మాట విని, ఒక ఆలయాన్ని నిర్మించి శివునికి అంకితం చేశాడు. పుష్కరణి (పవిత్రమైన చెరువు) అని పిలువబడే ఈ ఆలయంలో నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. స్వామివారి పుష్కరిణిలో 8 తీర్థాలు (నారాయణ, ధర్మ ఋషి, వరుణ, సోమ, రుద్ర, ఇందిర, డేటా) కలిగి ఉన్నాయని.. కనుక దీనిని 'అష్ట తీర్థ అమృత గుండం' అని కూడా అంటారు.

Dakshin Kashi: బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం.. పవిత్ర పుష్కరిణి.. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ’గా పిలుస్తారు ఎందుకో తెలుసా
Ketaki Sangameshwara Swamy1
Image Credit source: telangana tourism
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. 6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డికి చేరుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, రైల్వేలు , పెట్రోలియం వంటి అనేక ప్రధాన రంగాలు ఉన్నాయి. ప్రధాని పర్యటనతో సంగారెడ్డి వార్తల్లో నిలిచింది. సంగారెడ్డిలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ‘దక్షిణ కాశీ’ అంటారు.

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం జహీరాబాద్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఝరాసంగం గ్రామంలో ఉంది. ఇది ప్రసిద్ధ శివాలయం. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన కథ స్థానిక ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందింది. సూర్య వంశానికి చెందిన కుపేంద్ర రాజు కలలో శివుడు కనిపించాడని, ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని హిందూ పురాణాలలో చెప్పబడింది. సంగారెడ్డికి చెందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం తెలుసుకుందాం.

ఆలయానికి పునాది వేసిన కథ
తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ ప్రకారం.. ఒకప్పుడు సూర్య వంశానికి చెందిన రాజు కుపేంద్ర చర్మ వ్యాధితో బాధపడ్డాడు. వైద్యులెవరూ అతనికి చికిత్స చేయలేకపోయారు. ఒకరోజు హఠాత్తుగా కేతకీ వనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ప్రవహిస్తున్న నదిని చూశాడు. ఆ నదిలో స్నానం చేస్తూ తన శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకున్నాడు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఏ వైద్యుడూ నయం చేయలేని చర్మవ్యాధి వాగు నీటితో పూర్తిగా నయమైంది. అదే రోజు రాత్రి కుపేంద్ర రాజు కలలో శివుడిని దర్శించినట్లు చెబుతారు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం రాజు కలలో కనిపించిన శివుడు అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించమని రాజును కోరాడు. రాజు అతని మాట విని, ఒక ఆలయాన్ని నిర్మించి శివునికి అంకితం చేశాడు. పుష్కరణి (పవిత్రమైన చెరువు) అని పిలువబడే ఈ ఆలయంలో నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. స్వామివారి పుష్కరిణిలో 8 తీర్థాలు (నారాయణ, ధర్మ ఋషి, వరుణ, సోమ, రుద్ర, ఇందిర, డేటా) కలిగి ఉన్నాయని.. కనుక దీనిని ‘అష్ట తీర్థ అమృత గుండం’ అని కూడా అంటారు.

శివలింగాన్ని స్థాపించిన బ్రహ్మ

ఈ ప్రదేశం గురించి హిందూ పురాణంలో కథ ఉంది. విశ్వం ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడనే నమ్మకం ఉంది. ఇప్పుడున్న శివలింగాన్ని కూడా బ్రహ్మ ప్రతిష్టించాడు. ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ శివుడికి కేతకి పుష్పాలతో అంటే మొగలి పువ్వులతో పూజలు చేస్తారు. సాధారణంగా ఈ పూలను శివయ్య పూజకు ఉపయోగించరు. పూజలో ఎనిమిది పుణ్య తీర్థాలను కలిగి ఉన్న పుష్కరణిలోని నీరుని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ స్వామివారిని పుష్కరిణిలో నీటిని పూజ, అభిషేకాలకు ఉపయోగిస్తారు. ఈ ఆలయంలో శివుడిని కేతకీ సంగమేశ్వరుడు అని పిలుస్తారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు.

అష్ట తీర్థ అమృత గుండం-13వ శతాబ్దపు దేవాలయం

Ketaki Sangameshwara Swamy

సంగారెడ్డిలో అనేక ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. అందులో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం ఒకటి. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయాన్ని రెండవ శ్రీశైలం అని కూడా అంటారు. ఈ దేవాలయం పటాన్ చేరు మండలంలో ఉంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఐదు రోజుల పాటు పండుగగా జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..