Plants Vastu Tips: ఇంట్లో, ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పొరపాటున కూడా పెంచవద్దు.. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం..

|

Nov 16, 2023 | 9:46 AM

మొక్కలు, చెట్లతో సహా ప్రతి వస్తువును వాస్తులో ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ పేర్కొంది. ఈ వాస్తు నియమాలు పాటించకపోతే ఇంటి సభ్యులు ప్రతికూల పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోకూడదు. ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో దారిద్య్రంతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రోజు ఇంట్లో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాం.. 

Plants Vastu Tips: ఇంట్లో, ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పొరపాటున కూడా పెంచవద్దు.. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం..
Vastu Tips For Plant
Follow us on

వాస్తు శాస్త్రంలో సానుకూల , ప్రతికూల శక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మొక్కలు, చెట్లతో సహా ప్రతి వస్తువును వాస్తులో ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ పేర్కొంది. ఈ వాస్తు నియమాలు పాటించకపోతే ఇంటి సభ్యులు ప్రతికూల పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోకూడదు. ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో దారిద్య్రంతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రోజు ఇంట్లో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాం..

  1. తాటి చెట్టు: పొరపాటున కూడా పెరట్లో తాటి చెట్టును నాటవద్దు. ఇది అశుభకరంగా పరిగణించబడుతుంది. తాటి చెట్టు ఆకులు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ మొక్కను నాటడం వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలుగుతాయని నమ్మకం.
  2. చింత చెట్టు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చింతచెట్టు నాటకండి. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. ఈ చింత చెట్టుని ఇంట్లో పెంచడం వలన ఇంట్లో ఎప్పుడూ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఇంట్లో చింత చెట్టుని పెంచకూడదు.
  3. రావి చెట్టు; ఇంట్లో రావి చెట్టుని పెంచవద్దు. వాస్తు ప్రకారం ఇంట్లో రావి చెట్టుని పెంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుంది. గోడపైనా, ఇంట్లో ఏ మూలన అయినా మొక్క పెరిగితే దానిని వెంటనే తొలగించాలి.
  4. ముళ్ల చెట్లు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ఆవరణ చుట్టుపక్కల ముళ్ల చెట్లను ఎప్పుడూ పెంచకండి. ముళ్ల చెట్లు ఉంటే ఇంట్లో టెన్షన్‌ నెలకొంది. ఈ మొక్కలు ఇంట్లో సభ్యుల మధ్య పరస్పర విభేదాలను పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. చాలా సార్లు తెలియకుండానే ఇంట్లో ముళ్లమొక్కలను  నాటుతారు. ఇలా చేయడం విధ్వంసానికి దారితీస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బోన్సాయ్ చెట్టు: ప్రస్తుతం ఇంటి అలంకరణ కోసం బోన్సాయ్ మొక్కలను పెట్టుకునే ట్రెండ్ పెరిగింది. ఈ మొక్కలు చూడటానికి అందంగా ఉంటాయి. అయితే ఈ మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటాయి. ప్రగతికి అడ్డంకులుగా మారతాయి.
  7. గోరింటాకు మొక్కు: గోరింటాకు మొక్క ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం గోరింటాకు మొక్క దుష్ట శక్తులకు ఆశ్రయం ఇస్తుందని విశ్వాసం. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఈ మొక్క ఇంట్లో శాంతి, ఆనందానికి భంగం కలిగిస్తుందని నమ్మకం.
  8. తుమ్మ చెట్టు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తుమ్మ చెట్టును నాటడం వల్ల వివాదాలు పెరుగుతాయి. దీంతో కుటుంబ సభ్యులు మానసికంగా ఇబ్బందులు పడతారు. తుమ్మ మొక్క ఇంటి ఆవరణలో ఉండటం  అశుభంగా పరిగణించబడుతుంది.
  9. ఎండిన మొక్కలు: ఇంట్లో నాటిన చెట్లు లేదా మొక్క ఎండిపోయినా వెంటనే వాటిని తొలగించడం మంచిది. వాస్తు ప్రకారం ఎండిపోయిన చెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి. అంతేకాదు ఆముదం మొక్కను ఇంట్లో  నాటడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు