
Pitru Paksha 2025: హిందూ మతంలో పితృ పక్ష సమయంలో చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం చేసే సంప్రదాయం ఉంది. హిందూ పంచాంగం ప్రకారం… ఈ పితృ పక్షం భాద్రపద మాసంలో పౌర్ణమి తిథి నుంచి అశ్వినీ మాసం అమావాస్య వరకు ఉంటాయి. పితృ పక్ష సమయంలో చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం చేసే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో తమ పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేస్తారు. పెద్దల ఆత్మ శాంతి కోసం అనేక పరిహారాలను పాటిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, శుభప్రదమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. కానీ, ఎవరైనా పితృ పక్షంలో శ్రద్ధారాధన చేయకపోతే ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
పూర్వీకుల ఆత్మల శాంతి కోసం వారి వారసులచే శ్రాద్ధం ఆచరించబడటం తప్పనసరిగా అవసరం అంటున్నారు పండితులు. పితృ పక్షంలో చేసే శ్రాద్ధం ద్వారా పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయని నమ్ముతారు. పెద్దల పేరు మీద తర్పణం, శ్రద్ధారాధన చేస్తారు. మరణించిన పూర్వీకుల పేరుతో పూజారులు లేదా పండితులకు నైవేద్యాలు సమర్పిస్తారు. పూర్వీకులు ఇష్టపడే ప్రత్యేక వంటకాలను వండుతారు. పండితులు లేదా బ్రాహ్మణ జంటను భోజనానికి ఆహ్వానిస్తారు.
ఈ రోజు సూర్యోదయం సమయంలో పూర్వీకులకు తిల, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను నైవేద్యం పెడతారు. ‘పూజ’, ‘హవన’ మరియు ‘దాన’ చేస్తారు. ఈ సమయంలో ఎటువంటి వేడుకలు నిర్వహించరు. కొత్తగా ఏమీ కొనకూడదని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం శ్రద్ధాంజలి ఆచరించకపోవడం వల్ల పితృ దోషం వస్తుంది. పితృ దోషం కారణంగా కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. శ్రాద్ధం చేయకపోవడం వల్ల వ్యాపారం, పిల్లలు, డబ్బు మొదలైన విషయాల్లోనూ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పితృ పక్ష సమయంలో పూర్వీకుల శ్రాద్ధం చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..