Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. తమకు తొచినంతలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా భక్తులు అక్షయ తృతీయను జరుపుకున్నారు. అయితే కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకున్నారు. కొన్ని ఆలయాల్లోకి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని పండర్‌పూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణీ ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని ఏకంగా 7 వేల మామిడి పండ్లతో అందంగా అలంకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుణెకు చెందిన ఓ వ్యాపారి అక్షయ తృతీయను పురస్కరించుకొని అందించిన విరాళాన్ని ఇందుకు వినియోగించారు. కేవలం గుడి ప్రాంగణాన్నే కాకుండా గర్భ గుడిలోని దేవతామూర్తులను సైతం మామిడి పండ్లతో అలంకరించడం విశేషం. కేవలం అలంకరణకే కాకుండా అనంతరం ఈ పండ్లను కరోనాతో బాధపడుతోన్న వారికి అందించడం మరో విశేషం. ఇదిలా ఉంటే గతేడాది కూడా ఈ ఆలయాన్ని 3100 మామిడి పండ్లతో దేవాలయాన్ని అలంకరించారు.
The temple of Lord Vitthal-Rukmani of #Pandharpur was decorated with 7000 #mangoes on the occasion of #AkshayaTritiya. See thread.#AkshayaTritiya2021 #VithobaTemple #Maharashtra pic.twitter.com/fI1w9h8clN
— India.com (@indiacom) May 14, 2021
Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,298 కరోనా కేసులు, 32 మరణాలు
Viral News: కిర్రాక్ సీన్.. చేప మెడలో వెడ్డింగ్ రింగ్.. మ్యాటర్ ఏంటంటే…