కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రావణ మాసంలో శివయ్యకు జంట సర్పాలను సమర్పించండి..

భోలాశంకరుడు శివయ్య నిర్మలమైన మనస్సుతో జలం సమర్పించినా భక్తుల కోరికలను తీరుస్తాడు. శివుడికి సోమవారం, మాస శివరాత్రి, శివరాత్రి లతో పాటు శ్రావణ మాసం, కార్తీక మాసం కూడా ప్రియమైనవి. ఇలాంటి పవిత్రమైన సమయంల్లో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల వస్తువులను సమర్పిస్తారు. తద్వారా శివుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. వీటిలో ఒకటి మహాదేవుడికి జంట పాములను సమర్పించడం. శ్రావణ మాసంలో శివలింగానికి జంట పాములను సమర్పిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రావణ మాసంలో శివయ్యకు జంట సర్పాలను సమర్పించండి..
Lord Shiva Puja

Updated on: Jul 16, 2025 | 6:54 AM

శ్రావణ మాసం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ మాసం ఆధ్యాత్మికతకు నెలవు. ఈ నెలలో శివ భక్తులు పూజలు చేసి మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. అలాగే శివలింగానికి అనేక వస్తువులను సమర్పిస్తారు. వాటిలో ఒకటి జంట పాములు. ఈ సమయంలో వెండి పాములను శివుడికి సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో శివలింగానికి వెండి పాములను సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

శివలింగానికి జంట పాములను ఎందుకు సమర్పిస్తారంటే
సాధారణంగా వెండి లేదా పంచలోహాలతో చేసిన జంట పాములను శివలింగానికి సమర్పిస్తారు,. దీనిని నాగ పంచమి లేదా మాస శివరాత్రి వంటి శుభ సందర్భాలలో సమర్పిస్తే చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అయితే శ్రావణ మాసంలో ఏ రోజుననైనా శివుడికి వెండి జత పాములను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

మత విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడికి వెండి జంట పాములను సమర్పించడం వల్ల కాల సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి. అందుకనే శ్రావణ మాసంలో శివలింగానికి వెండి పాముల జతను సమర్పిస్తే శివుని ఆశీర్వాదం పొందడానికి, ప్రతికూల శక్తిని తొలగించడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

శివయ్యకు జంట సర్పాలను ఎలా సమర్పించాలి?

  1. శివలింగానికి జంట సర్పాలను సమర్పించడం ఒక మతపరమైన కార్యక్రమం. కాల సర్ప దోషం నుంచి బయటపడటానికి, శివుని ఆశీర్వాదం పొందడానికి వెండి జంట సర్పాలను శివయ్యకు సమర్పించడం జరుగుతుంది.
  2. వెండి లేదా రాగి పాముల జత: మీకు దగ్గరలో ఉన్న శివాదేవాలయం దగ్గర నుండి లేదా పూజా సామాగ్రి అమ్మే దుకాణం నుంచి వెండి లేదా రాగి పాములను కొనుగోలు చేయవచ్చు.
  3. సరైన రోజును ఎంచుకోండి:జంట సర్పాలను సమర్పించడానికి నాగ పంచమి, సోమవారం లేదా శ్రావణ సోమవారం శుభప్రదంగా భావిస్తారు.
  4. ఆలయానికి వెళ్లండి: తరువాత శివలింగం ప్రతిష్టించబడిన ఏదైనా శివాలయానికి వెళ్లండి.
  5. అభిషేకం చేయండి: శివుడి పూజించండి. పాలు, నీరు, తేనె, నెయ్యి, పెరుగుతో అభిషేకం చేయండి.
  6. జంట సర్పాలను ప్రతిష్టించండి: దీని తరువాత శివలింగం దగ్గర మీరు తీసుకుని వెళ్ళిన జంట సర్పాలను అత్యంత భక్తితో సమర్పించండి.
  7. మంత్రాన్ని జపించండి: ఈ సమయంలో “ఓం నమః శివాయ ” లేదా “ఓం నాగేంద్రహరాయ నమః ” అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించండి.

 

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.