
సంఖ్యాశాస్త్రం జనన సంఖ్య ప్రకారం వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, విభిన్న అంశాలు వెల్లడిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం అత్యంత కోపంగా పరిగణించబడే కొన్ని జనన సంఖ్యలు ఉన్నాయి. వీరికి కోపం రావడానికి పెద్దగా కారణాలు అవసరం ఉండదు. ముక్కు మీదే కోపం ఉంటుంది. మూల సంఖ్యల ఆధారంగా మన వ్యక్తిత్వం, భావోద్వేగాలు, ప్రవర్తన గురించి సంఖ్యాశాస్త్రం ఆసక్తికరమైన అంతర్దృష్టులను అందిస్తుంది. వీటిలో కొన్ని సంఖ్యలు అమితంగా కోపం కలిగి ఉంటాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ మూల సంఖ్య వారు అత్యంత కోపం కలిగి ఉంటారంటే..
మూల సంఖ్య 1
స్వభావం: నంబర్ 1 ఉన్న వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు, ఆత్మగౌరవం కలిగి ఉంటారు.
కోపం: వీరు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఎవరైనా తమ మాట వినకపోతే లేదా వారు తమ కోరికలను నెరవేర్చలేకపోతే అమితమైన కోపానికి గురవుతారు.
కారణం: వీరు ఉద్రేక పరులు. ఆధిపత్య భావన వీరిని సులభంగా కోపానికి గురయ్యేలా చేస్తాయి. అయితే వీరి కోపం ఎక్కువ సమయం ఉండదు.
మూల సంఖ్య 4
స్వభావం : కష్టపడి పనిచేసే గుణం, క్రమశిక్షణ , స్థిరమైన స్వభావం వీరి సొంతం
కోపం: అయితే తమ విషయాల పట్ల నియంత్రణ కోల్పోయినప్పుడు లేదా నియమాలు ఉల్లంఘించినప్పుడు.. ఈ వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు.
కారణం: వీరికి సహనం తక్కువగా ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వీరికి వెంటనే కోపం వచ్చేస్తుంది.
మూల సంఖ్య 7
స్వభావం: మానసికంగా లోతైన ఆలోచన, రహస్యమైన, సున్నితమైన వ్యక్తులు.
కోపం: బాహ్య ప్రపంచానికి దూరంగా ఒంటరితనంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఈ ఒంటరితనం అనుభూతి కారణంగా కొన్నిసార్లు ఆకస్మిక కోపాన్ని ప్రదర్శించవచ్చు.
కారణం: వీరికి కోపం వెంటనే రాదు. లోలోపల అణచి ఉంచుతారు. కొన్నిసార్లు బయటపడుతుంది. అప్పుడు ఆ కోపం ఉగ్ర రూపంలో ఉంటుంది.
మూల సంఖ్య 9
స్వభావం: వీరు కరుణామయులు, భావోద్వేగపరులు, న్యాయవంతులు.
కోపం: వీర అన్యాయం లేదా ద్రోహం జరిగింది అని భావించినప్పుడు..వెంటనే కోపం వచ్చేస్తుంది.
కారణం: వీరికి కోపం సామాజిక అసమానత లేదా తప్పులు జరిగే వస్తుంది.
అత్యంత కోపం ఉన్న మూల సంఖ్య ఏదంటే
సంఖ్యాశాస్త్రంలో నంబర్ 1 ఉన్న వ్యక్తులు అత్యంత కోపం ఉన్న వ్యక్తులు ఉద్వేగభరితులుగా పరిగణించబడతారు. వీరి కోపం తీవ్రంగా ఉంటుంది.. అయితే త్వరగా శాంతిస్తారు. నాయకత్వ స్వభావం ఉంటుంది తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి పోరాడుతారు.. కనుక కోపం వీరి వ్యక్తిత్వంలో ఒక భాగం.
నంబర్ 1: ధ్యానం, యోగా , ప్రాణాయామ పద్ధతులను అవలంబించండి.
సంఖ్య 4: ఓర్పును పెంచుకోవడానికి సమయ నిర్వహణ, సానుకూల ఆలోచన అవసరం.
సంఖ్య 7: వీరు ధ్యానం చేయాలి. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి.
సంఖ్య 9: వీరు తమ భావాలను వ్యక్తీకరించడానికి రచన లేదా కళ సహాయం తీసుకోవడం మంచిది
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.