Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపయ్యకు అందని తాపేశ్వరం లడ్డు.. మరి ఎవరిచ్చారంటే..
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంటే మొదట అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. భాగ్యనగరం మొత్తం ఎన్ని విగ్రహాలు పెట్టినా ఖైరతాబాద్ గణనాథుడికి ఉండే ప్రత్యేకతే వేరు. అదే స్థాయిలో లడ్డుకు కూడా ప్రత్యేక స్థానం...
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంటే మొదట అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. భాగ్యనగరం మొత్తం ఎన్ని విగ్రహాలు పెట్టినా ఖైరతాబాద్ గణనాథుడికి ఉండే ప్రత్యేకతే వేరు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ. ఎత్తులోనూ అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ పోతారు. అందుకే, ఒక్క భాగ్యనగర వాసులే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు వస్తుంటారు. అలాగే ఈ భారీ గణనాథుడి కోసం అంతే స్థాయిలో భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు. ఇలాంటి లడ్డూ కోసం భక్తులు వేల సంఖ్యలో పోటీపడటం ఏటా మామూలే. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి గత 12 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతి కోసం లడ్డూను తీసుకొస్తారు. అయితే.. ఈ సంప్రదాయానికి ఈ ఏడాదితో బ్రేక్ పడనుంది. ఈ ఏడాది నుంచి భారీ లంబోదరుడి లడ్డూను స్థానికంగానే తయారు చేయించారు.
ఈ ఏడాది హైదరాబాద్ వాసీల నుంచి 2000 కేజీల లడ్డును తయారు చేయించారు. ఈ ఏడాది వినాయక స్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్స్ యజమాని శ్రీకాంత్ నుంచి 1100 కేజీల లడ్డును లంబదోదరుడి కోసం సిద్ధం చేశారు. భక్తాంజనేయ స్వీట్ నుంచి 900 కేజీల లడ్డును స్వామివారి సమర్పించనున్నారు.
లడ్డు తయారీ పూర్తి..
స్వామివారికి సమర్పించేందుకు తయారు చేసిన మహా ప్రసాదం లడ్డును ప్రత్యేక వాహనాల్లో ఖైరతాబాద్‌కు తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత స్వామివారి ముందు ప్రత్యేక స్థలంలో ఈలడ్డును పెట్టి స్వామివారికి సమర్పించనున్నారు.
గతంలో తాపేశ్వరం..
తాపేశ్వరానికి చెందిన ‘సురుచి ఫుడ్స్’ అధినేత మల్లిబాబు.. 2010 నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. ఈ లడ్డూ పలుమార్లు గిన్నిస్ బుక్‌లోనూ చోటు దక్కించుకుంది. గణపతి నిమజ్జనం తర్వాత మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.
ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..
Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..