
ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి. ఇందులో నిర్జల ఏకాదశిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. నిర్జల ఏకాదశి ఉపవాసం అన్ని ఏకాదశిలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున పాటించబడుతుంది. దీనినే భీమ ఏకాదశి అని కూడా అంటారు. అంటే భీముడు ఈ ఏకాదశిని చేయడం మొదలు పెట్టాడని.. అప్పటి నుంచి ఈ ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణాల కథనం. ఈ ఏడాది అంటే 2025 సంవత్సరంలో, జూన్ 6, శుక్రవారం రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించబడుతుంది. ఈ రోజున పేదవారికి దానం చేయడం వల్ల పాపాలు నశించి, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
నిర్జల ఏకాదశి తిథి జూన్ 06, 2025 మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి మర్నాడు అంటే జూన్ 07న ఉదయం 4.47 గంటలకు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఉదయ తిథి అయినందున, ఏకాదశిని 6 జూన్ 2025, శుక్రవారం రోజున జరుపుకుంటారు.
అన్ని ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆహారం మాత్రమే కాదు కనీసం నీరు కూడా తీసుకోకుండా పాటిస్తారు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ కఠినమైన ఉపవాస నియమాల కారణంగా ఈ ఉపవాసం కష్టం. ఏడాది పొడవునా వచ్చే ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే.. వారికి మిగతా అన్ని ఏకాదశుల చేసినట్లే అని.. అత్యంత ఫలవంతమైన ఏకాదశి అని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున చేసే దానధర్మాలకు విశిష్ట స్థానం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు