AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Plants: మన ఇంట్లో ఈ మొక్కలుంటే అదృష్టం, డబ్బు అన్నీ వస్తాయి..!

ఇంట్లో కొన్ని పవిత్ర మొక్కలు పెంచితే అదృష్టం, విజయం, ధన సంపత్తి వస్తాయని చాలా మందికి నమ్మకం ఉంది. ఇవి మన జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తాయని భావిస్తారు. ఇంట్లో లేదా ఆఫీసులో ఈ మొక్కలను పెట్టడం వల్ల చుట్టూ శుభ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి 7 పవిత్ర మొక్కల గురించి తెలుసుకుందాం.

Lucky Plants: మన ఇంట్లో ఈ మొక్కలుంటే అదృష్టం, డబ్బు అన్నీ వస్తాయి..!
Lucky Plants
Prashanthi V
|

Updated on: Jun 02, 2025 | 2:54 PM

Share

తులసి హిందూధర్మంలో ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దీనిని రోజూ భక్తులు పూజిస్తారు. ఇంట్లో తులసి పెంచితే గాలి శుభ్రంగా మారుతుంది. దీని వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, ఇంట్లో శాంతి కలుగుతుంది. శ్రీమహావిష్ణువు కరుణ కూడా పొందుగలమనే నమ్మకం ఉంది. ఇంట్లో ఉన్న తులసి స్వచ్ఛతకు, రక్షణకు చిహ్నంగా నిలుస్తుంది.

ఆరే చెట్టు విష్ణుతో సంబంధం ఉందని చెప్పబడుతుంది. ఆరే మొక్క ఉండటం వల్ల మానసిక స్పష్టత పెరుగుతుంది. అదృష్టం కూడా వస్తుందని నమ్మకం ఉంది. ఇది చెడు శక్తులను తొలగించి శ్రేయస్సు తీసుకువస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతారు.

మర్రి చెట్టు శివుడిని సూచిస్తుంది. ఇది దీర్ఘకాలం బతికే చెట్టు కాబట్టి శాశ్వతత్వానికి సంకేతంగా భావిస్తారు. దీని సన్నిధిలో ఉండటం వల్ల స్థిరత్వం వస్తుంది. ఇంట్లో ఐక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది.

వేప చెట్టు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శుభ శక్తిని కూడా కలిగిస్తుంది. దీనిని గ్రామ ఔషధశాల అని పిలుస్తారు. వేప ఆకులు, కొమ్మలు పూజలలోనూ, ఉత్సవాలలోనూ వాడతారు. ఇది చెడు శక్తులను దూరం చేస్తుంది. ఇంట్లో వేప చెట్టు పెంచితే శుభ పరిణామాలు జరుగుతాయని నమ్ముతారు.

మనీ ప్లాంట్ ధనం, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్ చాలా తేలికగా పెరుగుతుంది. దీన్ని ఇంట్లో ఉంచితే డబ్బు సమృద్ధిగా వస్తుందని నమ్మకం. ఇది మనలో ధనానికి సంబంధించిన ఆశయాలను బలపరిచి మంచి ఫలితాలవైపు నడిపిస్తుందని చెబుతారు.

అంజూర చెట్టు ఆయుర్వేదంలో ప్రాముఖ్యత కలిగినదిగా చెప్పబడుతుంది. దీని బెరడు, ఆకులు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. ఇది శివుడితో సంబంధం కలిగిన మొక్క. ఈ చెట్టుని ఇంట్లో పెంచితే ధైర్యం పెరుగుతుంది. స్థిరంగా జీవించడానికి ఇది తోడ్పడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది సహాయం చేస్తుంది.

అశోక చెట్టు ప్రేమకు, ఆనందానికి చిహ్నంగా ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. ఇంటి దగ్గర ఈ చెట్టు పెంచితే భావోద్వేగంగా మంచిగా ఉంటాం. ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో కలిసిమెలిసి ఉండే వాతావరణం ఏర్పడుతుంది.

ఈ మొక్కలన్నీ హిందూ సంప్రదాయంలో శుభానికి చిహ్నాలుగా భావించబడతాయి. ఆరోగ్యం, ధనం, శాంతి, ఐక్యత కావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచడం మంచిది.