Mysuru: ధగ ధగ మెరిసిపోతున్న మైసూరు ప్యాలెస్.. దసరా ఉత్సవాల్లో ఒక్కసారైనా సందర్శించాల్సిందే..

|

Oct 02, 2022 | 9:39 AM

చెడు పై మంచి సాధించిన విజయానికి వేడుకే విజయదశమి. మహిషాసురుడిని సంహరించిన జగన్మాత.. సకల లోకాలకు అభయం అందించింది. ఇందుకు గుర్తుగా దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి..

Mysuru: ధగ ధగ మెరిసిపోతున్న మైసూరు ప్యాలెస్.. దసరా ఉత్సవాల్లో ఒక్కసారైనా సందర్శించాల్సిందే..
Mysuru Celebrations
Follow us on

చెడు పై మంచి సాధించిన విజయానికి వేడుకే విజయదశమి. మహిషాసురుడిని సంహరించిన జగన్మాత.. సకల లోకాలకు అభయం అందించింది. ఇందుకు గుర్తుగా దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. ఒక్కోక్క ప్రాంతంలో వేడుకలు ఒక్కో రకంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలకు మైసూరు చాలా ఫేమస్. శక్తిపీఠమైన చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి జరిగే ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రత్యేక పూజలు, పాటలు, భజనలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు శోభాయమానంగా జరుగుతాయి. మైసూర్ అనే పేరు మహిసుర నుంచి వచ్చింది. చాముండేశ్వరి దేవీ మహిషాసురుడిని చంపిన ప్రాంతం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అయితే మైసూర్ ఆధ్యాత్మికతకే కాకుండా.. చక్కటి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ లభించే పట్టు వస్త్రాలు, ధూపం, గంధపు చెక్క ఉత్పత్తులు, ప్యాలెస్‌ వరల్డ్ ఫేమస్. ఇందులో ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్ గురించి చెప్పుకోవాలి. విలాసవంతమైన గదులతో, ఇండో-సార్సెనిక్ కాంప్లెక్స్ మైసూర్ రాష్ట్రానికి చెందిన మహారాజులు – వడయార్లు నిర్మించారు. వారి కుల దేవత చాముండేశ్వరి. నవరాత్రి వేడుకల్లో వారు దేవీ ఆరాధన చేస్తూ అమ్మవారి కృపకటాక్షాలు పొందారు.

చాముండి కొండపై ఉన్న ఆలయాన్ని సందర్శించడంతో మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల సందర్భంగా అక్కడ జరిగే ఫుడ్, క్రాఫ్ట్ ఫెయిర్‌, డ్యాన్స్, రెజ్లింగ్ భక్తులను కట్టిపడేస్తుంటాయ. రాత్రి సమయంలో ప్యాలెస్ ముందు జరిగే సంగీత కార్యక్రమాలు ఉత్సవాలకే హైలైట్ గా చెప్పవచ్చు. నవరాత్రుల పదో రోజైన విజయదశమి నాడు మిరుమిట్లు గొలిపే ఊరేగింపులో మహారాజుల కాలంనాటి వైభవం,చాముండేశ్వరి దేవత చిత్రం బంగారు పల్లకిలో ఒక కపారిసన్డ్ ఏనుగుపై ఊరేగింపు చేస్తారు. ఒంటెలు, అశ్వాలు, నృత్యకారుల ప్రదర్శనలతో బరాత్ ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది.

సెప్టెంబర్ చివరలో – అక్టోబర్ ప్రారంభంలో మైసూర్ ను సందర్శించేందుకు అనువైన సమయంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉండే కైలాస కోరా పర్వతం చాలా పవిత్రమైనది. కొండపైసుమారు వెయ్యి మెట్లు ఎక్కిన తర్వాత చాముండి ఆలయం వస్తుంది. ఆలయం వెలుపల ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో పొడవాటి పాముతో ఉన్న రాక్షసుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో చాముండీ మాత తన చల్లని చూపులతో భక్తజనులను ఆదుకుంటూ.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నీరాజనాలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..