AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2025: నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారిని భక్తిశ్రద్దలతో పూజిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ నవరాత్రి వేడుకలు వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ దుర్గాదేవిని నగర్ సేథాని మాతగా భావించి పూజిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు , మాణిక్యాలతో చేసిన విలువైన ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ ఆభరణాలు అమ్మవారి అందాన్ని మరింతగా పెంచుతాయి. గత 157 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి బంగారం, వెండి , వజ్రాల ఆభరణాలను సమర్పించే సంప్రదాయం కొనసాగుతుంది.

Navaratri 2025:  నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు
Jabalpur Mata Nagar Jethani
Surya Kala
|

Updated on: Sep 26, 2025 | 7:41 AM

Share

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా తర్వాత, దుర్గా పూజ , నవరాత్రి ఉత్సవాల వైభవానికి ప్రసిద్ధి చెందిన నగరం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్. కోల్‌కతా మాదిరిగానే ఇక్కడ కూడా దుర్గా పూజకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తొమ్మిది రోజుల పాటు నగరం మొత్తం అమ్మవారి మండపాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో భక్తి , విశ్వాసంతో అమ్మవారిని పూజించే భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రజలు బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలను కూడా అమ్మవారికి కానుకలగా సమర్పిస్తారు. తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. ఈ సంప్రదాయం ఫలితంగా నేడు జబల్‌పూర్‌లోని నగర్ సేథాని మాత కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలతో అలంకరించబడి ఉంది.

అమ్మ దగ్గర 10 కోట్ల విలువైన ఆభరణాలు

సరఫా నున్హై ప్రాంతంలో ఉన్న నగర్ సేథాని అని పిలువబడే ఈ దుర్గమ్మ విగ్రహానికి ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన విలువైన ఆభరణాలు, రత్నాలు ఉన్నాయి. విగ్రహం రూపకల్పన బుందేల్‌ఖండ్ శైలిలో ఉంది. ఈ విగ్రహాన్ని నగలతో అలంకరించినప్పుడు.. భక్తుల రద్దీ ఎంతగా ఉంటుందంటే వీధుల్లో నడవడం కూడా కష్టమవుతుంది. నగరవాసులకు ఈ విగ్రహం విశ్వాసానికి మాత్రమే కాకుండా సాంస్కృతిక గుర్తింపుకు కూడా చిహ్నం.

ఇది 156 సంవత్సరాల క్రితం స్థాపించబడింది

జబల్పూర్ దుర్గా పూజ చరిత్ర బ్రిటిష్ పాలన నాటిదని కమిటీ కోశాధికారి అమిత్ సరాఫ్ వివరించారు. సుమారు 156 సంవత్సరాల క్రితం బెంగాల్ నుంచి ప్రజలు జబల్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వచ్చారు. బ్రిటిష్ పాలనలో ఈ బెంగాలీలను తీసుకువచ్చి జబల్పూర్‌లో స్థిరపరిచారు. జబల్పూర్‌కు వచ్చిన బెంగాలీ సమాజం బెంగాలీ క్లబ్‌ను ఏర్పాటు చేసుకుంది. నగరంలోని సాధారణ ప్రజలు దుర్గాదేవి మండపాలను సందర్శించడానికి ఈ క్లబ్‌కు వచ్చినప్పుడు.. బెంగాలీలు వారిని లోపలికి అనుమతించడానికి నిరాకరించారు. తదనంతరం కొంతమంది సరఫా వ్యాపారులు కూడా సందర్శించడానికి వచ్చారు.. అప్పుడు కూడా బెంగాలీలు అమ్మవారి దర్శనానికి నిరాకరించారు. కోపంతో స్థానిక నివాసితులు తామే సొంతంగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని దుర్గా విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా 156 సంవత్సరాల క్రితం సరఫాలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. బెంగాలీలు కాకుండా జబల్పూర్‌లో విగ్రహం ప్రతిష్టించబడిన మొదటి దుర్గా పండల్ ఇది. దాదాపు 156 సంవత్సరాల క్రితం స్థాపించబడిన నగర్ సెథాని పండుగ రూపం .. సంప్రదాయం నేటికీ అలాగే ఉంది. విగ్రహం అలంకరణలు, ఆభరణాలు ఇప్పటికీ అప్పటి విధంగానే తయారు చేయబడ్డాయి. ఈ కొనసాగింపు దేవతపై భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని కాపాడుతోంది.

ఇవి కూడా చదవండి

నగర్ సెథాని అలంకరణ

నగర్ సెథాని అలంకరణ ప్రత్యేకమైనది. విగ్రహంపై ఉన్న బంగారం, వెండి, వజ్రం, ముత్యం , రూబీ ఆభరణాలు అర క్వింటాలు కంటే ఎక్కువ బరువు ఉంటాయి. మెడలో మంగళసూత్రం, ముత్యాల హారాలు సహా అనేక ఆభరణాలున్నాయి. ఇవి దేవత అందాన్ని పెంచుతాయి. చేతులకు బంగారు కవచాలు, గాజులు వంటి అనేక వస్తువులతో అలంకరించారు. నడుముకి వడ్డాణం సహా ముత్యాల దండలు కూడా ఉంటాయి. పాదాలను చీలమండలకు పట్టీలు, కడియాలు వంటి అనేక ఆభరణాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతి సంవత్సరం భక్తుల నగలను విరాళాలుగా ఇస్తారు, దీంతో అమ్మవారి ఆభరణాల సంఖ్య, విలువ కూడా ఏటా పెరుగుతూ ఉంటుంది.

అమ్మవారి 350 కిలోల వెండి రథం

అమ్మవారు మాత్రమే కాకుండా ఆమె ఆయుధాలు, వాహనం కూడా ప్రత్యేకంగా అలంకరించబడి ఉంటాయి. కత్తి, గొడుగు, చక్రం , హారతి పళ్ళెం స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడ్డాయి. అమ్మవారి వాహనం అయిన సింహం, బంగారు కిరీటం, హారము, వెండి పాదరక్షలను ధరిస్తుంది. సింహాసనం బంగారం.. వెండితో చెక్కబడి ఉండటం వలన ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నగర పర్యటన కోసం 350 కిలోల వెండి రథాన్ని సిద్ధం చేశారు. విజయదశమి రోజున అమ్మవారు ఈ రథంపై దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదిస్తుంది.

తల్లి రక్షణ కోసం 24 గంటలు 4 మంది సైనికులు కావాలా

జబల్పూర్ లోని నున్హై , సన్రహై ప్రాంతాలను సాంప్రదాయ బులియన్ మార్కెట్లుగా పరిగణిస్తారు. ఇక్కడి మట్టిలో కూడా బంగారం, వెండి రేణువులు ఉంటాయని చెబుతారు. నేటికీ కార్మికులు ఉదయం , సాయంత్రం దుమ్మును సేకరిస్తూ కనిపిస్తారు. అందుకే నగర్ సెథాని మాతకు సమర్పించే నగలు మరింత ముఖ్యమైనవి. ఆభరణాల విలువను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిపాలన సిబ్బంది ప్రతి సంవత్సరం కఠినమైన భద్రతా చర్యలను తీసుకుంటుంది. విగ్రహ ప్రతిష్టాపన నుంచి విజయదశమి వరకు.. 24 గంటలూ భద్రతను మోహరిస్తారు. నలుగురు సాయుధ పోలీసు సిబ్బంది నిరంతరం అమ్మవారికి కావాలా ఉంచుతారు. నగర పర్యటనల సమయంలో 100 మందికి పైగా పోలీసు అధికారులు విగ్రహంతో పాటు వెళతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు