Navratri Puja: నేడు నవరాత్రులలో మొదటి రోజు.. నవదుర్గగా శైలపుత్రి.. పూజ, కలశ స్థాపన శుభ సమయం..

|

Oct 15, 2023 | 10:30 AM

నవరాత్రుల పూజ సమయంలో మొదటి రోజు అఖండ జ్యోతిని వెలిగంచి ఈ తొమ్మిది రోజులు ఈ అఖండ జ్యోతి ఆరకుండా చూస్తారు. దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది నవరాత్రుల మొదటి రోజు పూజా సమయం, పూజా విధానం, శైలపుత్రిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

Navratri Puja: నేడు నవరాత్రులలో మొదటి రోజు.. నవదుర్గగా శైలపుత్రి.. పూజ, కలశ స్థాపన శుభ సమయం..
Navaratri 1st Day
Follow us on

హిందువుల అతిపెద్ద పండుగ  శరన్నవరాత్రులు నేటి నుండి అంటే అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు శుభ సమయంలో దుర్గా దేవిని కలశాన్ని ఏర్పాటు చేసి ఆవాహన చేస్తారు. అనంతరం మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని 9 విభిన్న రూపాలను అత్యంత భక్తితో పూజిస్తారు. సనాతన ధర్మం ప్రకారం, శరన్నవరాత్రులు మొదటి రోజు అమ్మవారు శైలపుత్రికిగా అలంకరిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం  శైలపుత్రిని పూజించడం ద్వారా.. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని.. ప్రతి కోరిక నెరవేరుతుందని విశ్వాసం.

నవరాత్రుల పూజ సమయంలో మొదటి రోజు అఖండ జ్యోతిని వెలిగంచి ఈ తొమ్మిది రోజులు ఈ అఖండ జ్యోతి ఆరకుండా చూస్తారు. దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది నవరాత్రుల మొదటి రోజు పూజా సమయం, పూజా విధానం, శైలపుత్రిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

శైలపుత్రి పూజ ప్రాముఖ్యత:

నవరాత్రుల మొదటి రోజున దుర్గాదేవిని శైలపుత్రి అలంకారంలో పూజిస్తారు. పర్వత రాజు హిమాలయాల ఇంట్లో జన్మించినందున ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. తల్లి శైలపుత్రి చాలా కఠోర తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది. శైలపుత్రి కరుణ, సహనం, ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు. శైలుపత్రిని  ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లికాని అమ్మాయిలకు తగిన వరుడు లభిస్తాడు. వరుడి కోసం అన్వేషణ ముగుస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

నవరాత్రులలో కలశ స్థాపనకు రెండు శుభసమయాలు

నవరాత్రులలో కలశాన్ని ఏర్పాటు చేయడానికి  ప్రతిపాద తిథి 14 అక్టోబర్ 2023న రాత్రి 11.24 గంటలకు ప్రారంభమై 16 అక్టోబర్ 2023 ఉదయం 12.03 గంటలకు ముగుస్తుంది. నవరాత్రుల మొదటి రోజున అభిజిత్ ముహూర్తంలో కలశాన్ని స్థాపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

కలశ స్థాపనకు అనుకూలమైన సమయం ఉదయం 06:30 నుండి 08:47 వరకు ఉంది

కలశ స్థాపనకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11.44 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంది.

కలశాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూజా ద్రవ్యాలు

శరన్నవరాత్రులలో కలశ స్థాపనకు విశేష ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి మొదటి రోజున, ఘటస్థాపన (కలశ స్థాపన) ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు. కలశ స్థాపనకు కొన్ని ప్రత్యేక పదార్థాలు అవసరం. అవి లేకుండా  దుర్గాపూజ అసంపూర్ణం. కలశాన్ని ఏర్పాటు చేయడానికి పీఠం, పరిశుభ్రమైన నేల, మట్టి లేదా రాగి కలశంతో కూడిన మూత,  ఎర్రటి గుడ్డ, కొబ్బరి, తమలపాకు, గంగాజలం, మామిడి  ఆకులు, నవ ధాన్యాలు,  ఎర్రటి పువ్వులు, కుంకుమ, తమలపాకులు, స్వీట్లు, పరిమళ ద్రవ్యాలు, నాణేలు, అక్షతలు మొదలైనవికావాలి.

కలశ స్థాపన చేసే పద్ధతి

  1. నవరాత్రులను ప్రారంభించే ముందు కలశాన్ని స్తాపించాలంటే.. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశ ను ఎంచుకోండి.
  2. కలశాన్ని స్థాపించడానికి పూజా వేదికపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, అక్షత అష్టదళాల పద్మాన్ని ఏర్పాటు చేసి అనంతరం దుర్గాదేవి విగ్రహాన్ని ఉంచండి.
  3. రాగి పాత్రని తీసుకుని ఆ కలశంలో నీరు, గంగాజలం, నాణెం, పసుపు, కుంకుమ. దుర్వ, తమలపాకులు, వేసి కలశాన్ని రెడీ చేయండి.
  4. ఆ కలశంపై 5 మామిడి ఆకులన్న కొమ్మని వేసి కొబ్బరికాయలో పెట్టి.. ఎర్రటి బట్టను దుస్తులుగా అలంకరింపజేయండి.
  5. ఒక పాత్రలో శుభ్రమైన మట్టిని వేసి నవ ధాన్యాలు వేసి ఒక్క పక్కన పెట్టుకోండి.
  6. దీపం వెలిగించి ముందుగా గణపతి పూజ చేసి అనంతరం దుర్గాదేవిని నవగ్రహాలను ఆవాహన చేయండి.
  7. తర్వాత నియమాల ప్రకారం అమ్మవారిని పూజించాలి.

శైలపుత్రి పూజా విధానం

నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి దేవిని ఆరాధించే ముందు ఆచారాల ప్రకారం కలశాన్ని స్థాపించి, అఖండ  జ్యోతిని వెలిగించి, గణేశుడిని ఆవాహన చేయండి. శైలపుత్రీకి తెలుపు రంగు అంటే ఇష్టం అంతేకాదు నారింజ ,  ఎరుపు రంగులు కూడా అమ్మవారికి అత్యంత ఇష్టమైన రంగులు.  కలశ స్థాపన తర్వాత షోడోపచర్ పద్ధతి ప్రకారం శైలుపత్రి దేవిని పూజించండి.  శైలపుత్రికి కుండుమ, తెల్ల చందనం, పసుపు, అక్షతలు,   తమలపాకులు,  కొబ్బరి సహా 16 అలంకరణ వస్తువులను సమర్పించండి. అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేసి తెల్లని స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. అనంతరం శైలపుత్రి బీజ మంత్రాలను జపించి, ఆపై హారతినివ్వండి. సాయంత్రం కూడా అమ్మవారికి ఆరతి నిర్వహించి ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయండి.

జపించాల్సిన మంత్రం

ఓం దేవీ శైలపుత్ర్యై నమః
హ్రీం శివాయై నమః అంటూ ఈ మంత్రాన్ని జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.