ఈ టెంపుల్ రహస్యం నేటికీ సైన్స్‌కు అందని మిస్టరీ.. ఐదు సార్లు రంగు మార్చుకునే లింగం.. ఏ సమయంలో ఏ రంగులో దర్శనం అంటే

|

Nov 11, 2024 | 5:03 PM

మన దేశంలో మాత్రమే కాదు ఇర్లాండ్, ఇండోనేషియా వంటి అనేక విదేశాల్లో కూడా హిందువులు పూజించే శివ లింగాలు దర్శనమిస్తాయి. హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో ప్రధమ స్థానం శివయ్యదే.. శివుడు వివిధ పేర్లతో వివిధ క్షేత్రాల్లో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. శివ లింగాలకు సంబందించిన అనేక మిస్టరీలు కూడా నేటికీ సైన్స్ చేధించని రహస్యలుగా చరిత్రలో మిలిపోయాయి. ఆలాంటి మిస్టరీని సొంతం చేసుకున్న శివాలయం తమిళనాడులో ఉంది. ఇక్కడ ఆలయంలోని శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది.. ఆలయంలోకి అడుగు శివయ్య అనుమతి లేనిదే వెయ్యలేమని ఓ నమ్మకం.. ఆ మిస్టరీ సొంతం చేసుకున్న శివాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఈ టెంపుల్ రహస్యం నేటికీ సైన్స్‌కు అందని మిస్టరీ.. ఐదు సార్లు రంగు మార్చుకునే లింగం.. ఏ సమయంలో ఏ రంగులో దర్శనం అంటే
Miraculous Lingam Temple
Follow us on

తమిళనాడు లోని ప్రముఖ నగరం కుభం కోణం. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకటి కళ్యాణసుందరేశ్వర్ ఆలయం. ఇది నల్లూరు లేదా తిరునల్లూరు శివార్లలోని నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇక్కడ శివుడిని కళ్యాణసుందరేసర్‌గా భార్య పార్వతిని గిరిసుందరిగా పూజిస్తారు. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుని నివాసం. ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తమ జీవితంలో దర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. అందుకనే ఈ ఆలయంలోని శివుడిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివయ్యను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించిన అనేక మిస్టరీలు ఉన్నాయి. అవి ఏమిటో తెలిస్తే షాక్ తింటారు.

కళ్యాణసుందరేశ్వ ర్ దేవాలయానికి సంబంధించిన అనేక పురాణకథలున్నాయి. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుడు నివాసం అని నమ్ముతారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం శివుడి తో పాటు తనయుడు కార్తికేయుడిని కూడా అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ ఆలయం వెయ్యి ఏళ్ల క్రితం.. పాండ్య రాజవంశంలోని మొదటి చోళుడు నిర్మించాడు. ఈ పురాతన ఆలయం అనేక సార్లు ధ్వంసం చేశారు. మళ్ళీ పునరుద్ధరించబడిందని చరిత్రకారుల కథనం. ఈ ఆలయం పురాతన ఆధ్యాత్మిక నగరం కాశీ విశ్వనాథ దేవాలయం వలె దక్షిణాన ప్రసిద్ధ చెందిన శివాలయం.

ఈ ఆలయంలో రెండు నల్లరాతి లింగాలు ఉన్నాయి.. ఒక శివ లింగం ఆలయ ప్రధాన గర్భగుడిలో ఉంది. ఇది బంగారంతో కప్పబడి ఉంటుంది. మరొకటి ఆలయ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం దగ్గర ప్రతిష్టంబడి ఉంది. అందుకనే ఈ కళ్యాణసుందరేసర్‌ ఆలయాన్ని “బ్లాక్ పగోడా” అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు రెండవ శివలింగాన్ని గంధపు పూతతో కప్పుతారు. ఉదయం 9 గంటలకు ఈ శివలింగం బంగారంలా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని కళ్యాణసుందరేశ్వరుడు రోజుకి ఐదు సార్లు తన రంగుని మార్చుకుంటారు. భక్తులకు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయంలోని శివ లింగం రోజుకి ఐదు సార్లు రంగు మారుతుంది. అందుకనే ఇతర శివాలయ కంటే ఈ శివాలయం వెరీ వెరీ స్పెషల్.

ఇవి కూడా చదవండి

ఐదు సార్లు రంగు మార్చుకునే శివయ్య.. ఏ సమయంలో ఏ రంగులో దర్శనం అంటే

ఈ ఆలయంలోని శివ లింగం ఉదయం పూజ సమయంలో నలుపు రంగులో (ఉదయం 8 నుంచి 11 గంటల వరకు) వరకూ దర్శనం ఇస్తుంది. ఇక మధ్యాహ్నం పూజ సమయంలో తెలుపు (మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు) రంగు లో కనిపిస్తూ కనువిందు చేస్తుంది, సాయంత్రం పూజ సమయంలో ఎరుపు (మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు) రంగులో కనువిందు చేస్తుంది. రాత్రి సమయంలో పూజకు లేత నీలం (రాత్రి 8 నుంచి 10 వరకు). pm).. అలరిస్తుంది.. ఇక చివరి రంగులో అర్ధరాత్రి సమయంలో శివయ్య తన రంగుని మార్చుకుంటాడు. రోజులో చివరిగా అంటే ఐదో రంగుగా ప్రకాశవంతమైన ఆకుపచ్చ (11pm నుంచి 12am) రంగులోకి మారతాడు.

ఉదయం వేళ

ఉదయం ఈ ఆలయంలో మహేశ్వరుడు బైద్యనాథుడుగా భక్తులకు దర్శనం ఇస్తాడు. తలపై బంగారు కిరీటం, మూడు కళ్ళు ఉంటాయి. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో బాణం పట్టుకుని ఉంటాడు. నంది తోడుగా ఉంటుంది. భక్తులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పుష్పాలు, చందనంతో పూజలు నిర్వహిస్తారు.

మధ్యాహ్నం పూజా సమయంలో

ఆయంలోని శివుడిని పౌర్ణమి రోజున భక్తులు నీలకంతుడిగా పూజిస్తారు. సర్వ శక్తి సిద్ధార్థి భగవంతుడిని భక్తులు పుష్పాలు, గంధపు ముద్దతో మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు పూజిస్తారు.

ఈ అద్భుతం వెనుక శాస్త్రీయ పరిశోధన..

ఆలయంలో రోజూ జరిగే ఈ వింత ఘటన వెనుక దైవం ఉన్నాడని భక్తుల నమ్మకం. అయితే రోజుకు ఐదు రంగులు మార్చుకుంటున్న శివ లింగానికి సంబంధించిన మిస్టరీని చేధించడానికి శాస్త్రజ్ఞులు రకరకాల ప్రయత్నలు చేశారు. కానీ ఈ దృగ్విషయం వెనుక దాగున్న రహస్యాన్ని నేటికీ చేధించలేక పోయారు. ఇదందా శివయ్య మహిమే అంటూ భక్తులు విశ్వసిస్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేర్వేరు సమయాల్లో ఐదు రంగుల్లో కనిపించే లింగాన్ని చూడాలని.. రంగులు మార్చుకునే సమయంలో భక్తులు దర్శించుకోలని భావిస్తారు. అయితే తనని దర్శించుకునే భక్తులను స్వామే స్వయంగా ఎంచుకుంటాడని ఓ నమ్మకం. ఏ రంగులో ఉండగా శివయ్యను దర్శించుకోవాలని భక్తులు నిర్ణయించుకున్నా శివయ్య అనుమతి లేనిదే ఆలయంలోకి అడుగు పెట్టలేరట.

ఎలా చేరుకోవాలంటే

కుంభకోణం నుంచి 10 కి.మీ దూరంలో.. తిరుక్కరుగవూరుకు 6 కి. మీ దూరంలో.. తంజావూరుకు 30 కి. మీ దూరంలో నల్లూరులోని ఈ మిస్టరీ శివాలయం ఉంది.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.