హిందూ మతంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం అంటే ఈ రోజు నాగ పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున నాగదేవతకు పూజలు చేసి అభిషేకం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఆధ్యాత్మిక శక్తి మీలో పుడుతుందని మత విశ్వాసం. పూజానంతరం కథ చదివే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. నాగ పంచమికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగ పంచమి కథను చదివిన లేదా విన్న వ్యక్తి, అతని కుటుంబం ఏడు తరాలు సర్పం భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని నమ్మకం.
నాగ పంచమి రోజున ఉపవాసం చేయడం శీఘ్ర కథను చదవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఈ వ్రతం అష్ట నాగులను పూజిస్తారు. ఈ రోజు అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షకుడు, కంబాల, కర్కోటకం, శంఖపాల అనే ఎనిమిది పాములను పూజిస్తారు. దీనితో నాగదేవత ఆశీస్సులతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు అనుగ్రహాన్ని పొందుతారు.
నాగ పంచమి కథ
పురాణ కథనం ప్రకారం పురాతన కాలంలో ఒక వ్యాపారికి ఏడుగురు కుమారులు ఉండేవారు. ఏడుగురికీ పెళ్లిళ్లు అయ్యాయి. చిన్నకొడుకు భార్య మంచి మనసు, మంచి నడవడిక గలది. అయితే ఒకరోజు పెద్ద కోడలతో పాటు మిగలిన కోడలను కుమ్మరి పనులు చేసేందుకు పుట్ట మట్టి తీసుకురావాలని కోడళ్లందరినీ అడిగాడు. అందరూ కర్రలు పలుగులతో మట్టిని తవ్వడం ప్రారంభించారు. అప్పుడు అక్కడ ఒక పాము కనిపించింది. పెద్ద కోడలు దానిని కర్రతో కొట్టడం ప్రారంభించింది. ఇది చూసిన చిన్న కోడలు తన తోటికోడలను ఆపి పాముని చంపవద్దు అని వేడుకుంది.
ఇది విన్న పెద్ద కోడలు పాముని చంప కుండా విడిచి పెట్టింది. అప్పుడు పాము దగ్గరకు వచ్చిన చిన్న కోడలు ఇక్కడే ఉండు.. మేము ఇంటికి వెళ్లి మళ్ళీ త్వరగా వస్తాను ఎక్కడికి వెళ్లిపోవద్దు అని పాముతో చెప్పింది. తర్వాత కోడళ్ళు అందరూ మట్టిని తీసుకుని ఇంటికి వెళ్లి అక్కడ పనిలో నిమగ్నమై పాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయింది. మర్నాడు చిన్న కోడలకి తాను పాముకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఆమె తన ఫ్యామిలీ సభ్యులను అందరినీ వెంట తీసుకొని పాము ఉన్న ప్రాంతానికి చేరుకుంది. ఇక్కడే పాముని ఉండమని చెప్పినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. పాము ని అన్నా అంటూ పిలిచి.. నన్ను క్షమించి మరచిపోయాను అని అడిగింది. దీంతో పాము.. చిన్న కోడలితో ‘అన్నయ్యా,అంటూ పిలిచావు కనుక నీవు చేసిన తప్పుని మన్నించి వదిలేస్తున్నాను. లేకుంటే ఇచ్చిన మాటను మరచిపోయిన నిన్ను ఇప్పుడే కాటేస్తాను అని అంది. సోదరా నేను తప్పు చేశాను, క్షమాపణలు కోరుతున్నాను” అని చెప్పింది. అప్పుడు పాము చిన్న కోడలను ఏదైనా వరం కోరుకోమని చెప్పింది. అప్పుడు చిన్న కోడలు సోదరా! నాకు ఎవరూ లేరు, నువ్వు నాకు అన్నయ్యగా మారడం విశేషం. అదే సంతోషం.
కొద్దిరోజుల తర్వాత పాము మానవరూపంలో ఆమె ఇంటికి వచ్చి ‘నా సోదరిని తనతో పంపించు’ అని చెప్పింది. ‘తనకు అన్నయ్య లేడు’ అని అందరూ అన్నారు, అప్పుడు నేను అతనికి దూరపు తమ్ముడినని చిన్నతనంలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు చిన్న కోడలికి సోదరుడి వెంట పంపించారు. దారిలో ‘నేను పాముని భయపడకు, నడవడానికి ఇబ్బంది ఉన్న చోటల్లా తోక పట్టుకో’ అన్నాడు. ఆమె చెప్పినట్లే చేసి అతని ఇంటికి చేరుకుంది. అక్కడి సంపదను, నగలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
ఒకరోజు పాము తల్లి చిన్న కోడలితో ‘నేను ఏదో పని మీద బయటకు వెళ్తున్నాను.. మీ సోదరుడికి చల్లని పాలు ఇవ్వమని చెప్పింది. అయితే పాల వేడిని చూసుకోకుండా పాముకి ఇవడంతో పాము ముఖం తీవ్రంగా కాలిపోయింది. ఇది చూసిన పాము తల్లికి కోపం వచ్చింది. అయితే పాము వివరించడంతో ఆమె శాంతించింది. అప్పుడు చిన్న కోడలికి పుట్టి నుంచి అత్తవారి ఇంటికి చీర సారేతో బంగారం, వెండి, రత్నాలు, నగలు మొదలైనవి ఇచ్చి అత్తారింటికి పంపించారు.
చిన్న కోడలు దగ్గర అంత డబ్బు చూసి పెద్ద కోడలు అసూయతో మీ అన్నయ్య చాలా ధనవంతుడు, నువ్వు అతని దగ్గర ఎక్కువ డబ్బు తీసుకురా అని చెప్పింది. ఈ మాటలు విన్న పాము బంగారు వస్తువులన్నీ తెచ్చి ఇచ్చింది. ఇది చూసిన పెద్ద కోడలు, ‘ఇంటిని తుడిచే చీపురు కూడా బంగారం అయి ఉండాలని కోరుకుంది. అప్పుడు పాము బంగారంతో చేసిన చీపురు తెచ్చి ఉంచింది. ఆ దేశ రాణి చెవిన చిన్న కోడలు గురించి ఆమెకు సోదరుడు ఇచ్చిన నగల గురించి పడ్డాయి. దీంతో రాజుతో తనకు వ్యాపారి చిన్న కోడలి హారం కావాలని చెప్పింది.
రాజు తన మంత్రితో వ్యాపారి వద్ద నుంచి హారాన్ని తీసుకొని వెంటనే హాజరుకావాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మంత్రి వ్యాపారి వద్దకు వెళ్లి చిన్న కోడలి హారాన్ని తీసుకుని వచ్చి రాజుకి ఇచ్చాడు. అప్పుడు ఆ చిన్న కోడలి హారాన్ని రాణి ధరిస్తుంది. అయితే చిన్న కోడలు తనకు అన్న ఇచ్చిన ఆహారం గురించి చాలా బాధపడింది. పాము సోదరుడిని గుర్తుచేసుకుంది. అతను రాగానే ప్రార్థించింది. సోదరా! రాణి హారాన్ని లాక్కుంది. నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అడిగింది. అంతేకాదు ఆ హారము రాణి మెడలో ఉండగా అది పాములా మారి.. తనకు తిరిగి ఇస్తే అది వజ్రాలు, రత్నాలతో తయారయ్యేలా చెయ్యి అని సలహా ఇచ్చింది. దీంతో పాము సరిగ్గా అలా చేసింది. రాణి హారాన్ని ధరించిన వెంటనే పాములా మారిపోయింది. అది చూసిన రాణి కేకలు వేసి ఏడవడం ప్రారంభించింది.
ఇది చూసిన రాజు తన చిన్న కోడలును వెంటనే పంపమని వ్యాపారికి సందేశం పంపాడు. రాజు ఏం చేస్తాడో అని వ్యాపారి భయపడ్డాడు. అతను తన చిన్న కోడలుతో కలిసి హాజరయ్యారు. రాజు చిన్న కోడలును అడిగాడు నువ్వు ఏమి మాయ చేసావు. నేను నిన్ను శిక్షిస్తాను. చిన్న కోడలు చెప్పింది.. రాజా నా ధైర్యాన్ని మన్నించండి. అప్పుడు ఈ నెక్లెస్ నా మెడలో ఉంటె వజ్రాలు, ముత్యాలను కలిగి ఉంటుంది. మరొకరి మెడలో పాములా మారుతుంది అని చెప్పింది. అది విన్న రాజు ఆ హారాన్ని రాణి నుంచి తీసుకుని చిన్న కోడలుకి ఇచ్చి ఇప్పుడే దీనిని ధరించి చూపించు అన్నాడు. చిన్న కోడలు ధరించిన వెంటనే ఆ హారం వజ్రాలు, రత్నాలతో తయారైంది.
అది చూసిన రాజు చిన్న కోడలు మాటలు నమ్మి సంతోషించి అతనికి బహుమానంగా చాలా నాణేలు ఇచ్చాడు. చిన్న కోడలు తన హారాన్ని, బహుమతిని పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె సంపదను చూసి పెద్ద కోడలు అసూయతో చిన్న కోడలు ఎక్కడో నుండి డబ్బు సంపాదించిందని చిన్న కోడలు భర్తకు చెప్పుడు మాటలు చెప్పింది. అది విన్న చిన్న కోడలు భర్త తన భార్యను పిలిచి ఈ డబ్బు నీకు ఎవరు ఇచ్చరో చెప్పు అంటూ అడిగాడు. అప్పుడు చిన్న కోడలు తన సోదరుడైన పాముని తలచుకుంది. ఆ సమయంలోనే పాము కనిపించి..తన సోదరి ప్రవర్తనపై ఎవరైనా అనుమానంతో అసూయతో ఇబ్బంది పెడితే నేను వారిని కాటు వేసి చంపేస్తా.. నేను నా సోదరికి రక్షణగా ఉన్న అని చెప్పింది. అది విని చిన్న కోడలు భర్త చాలా సంతోషించి నాగదేవత పట్ల ఎంతో గౌరవం చూపింది. ఆ రోజు నుండి నాగ పంచమి పండుగను జరుపుకునే సంప్రదాయం కొనసాగుతోంది. మహిళలందరూ సర్పాన్ని సోదరునిగా భావించి పూజిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు