
హిందూ మతంలో నాగ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వేడుకలలో నాగ పంచమి ఒక ముఖ్యమైన పండుగ. ఈ నెలలోని శుక్ల పక్ష పంచమి తిథి రోజున నాగ పంచమి పండుగ జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో నాగ పంచమి పండుగ మంగళవారం జూలై 29, 2025 నాడు వచ్చింది. ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్లగా భావించి పూజిస్తారు. పాముకి పాలు సమర్పిస్తారు. అలాగే ఈ రోజున మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతో ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు. 12 మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సంప్రదాయం. ఈ 12 మంది నాగులు శక్తి, జ్ఞానం, సంపద , రక్షణకు ప్రతీకలుగా నమ్మకం.
అనంత, వాసుకి, శేష, పద్మ, కద్రు, తక్షక, కాలీయ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ అనే ఈ 12 రకాల పాములను నాగ పంచమి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పుజిస్తారు.
ఓం భుజంగేశాయ విద్మహే, సర్పరాజాయ ధీమహి, తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్.
లేదా
సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే।
విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్। అనే మంత్రాన్ని పఠించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.