
మన దేశంలో వేల సంవత్సరాల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నిర్మాణం నేటికీ మిస్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారి సైన్స్ కే సవాల్ విసురుతున్నాయి. ఆలయ నిర్మాణం నుంచి గర్భ గుడిలో కొలువైన దేవుడి వరకూ అంతా మిస్టరీనే. అలాంటి ఆలయంలో ఒకటి కేరళలోని పుత్తుర్ గ్రామంలో ఉంది. 3 వేల ఏళ్ల నాటి పురాతన శివాలయం నీర్ పుతూర్ మహదేవ్ ఆలయంలోని రహస్యాని సైంటిస్టులు సైతం ఛేదించలేకపోతున్నారు.
ఈ ఆలయంలోని శివలింగం స్వయంగా ఉద్భవించిందట. ఈ గర్భ గుడిలోని శివలింగమే కాదు..శివలింగం ఉన్న గర్భగుడి ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది, ఇది అనేక మంది సందర్శకులను ఆకర్షించే ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భారత పురావస్తు సర్వే ప్రకారం ఈ ఆలయం మూడు వేలకు పైగా చరిత్ర ఉంది. పురాతన వాస్తుశిల్పం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు వేదికగా నిలుస్తుంది.
ఆలయం చుట్టూ ఉన్న నీరు కూడా ఓ మిస్టరీనే. ఇక్కడ నీరు ఏడాది పొడవునా అదే విధంగా ఉంటాయి. ఎంత ఎండలు వచ్చినా నీరు ఎండిపోవు. ఒకే లెవెల్ లో ఏడాది పొడువునా ఆలయం చుట్టూ నీరు ఉండడం సైంటిస్టులకు నేటికీ అంతుచిక్కని మిస్టరీనే. ఈ నీరు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. అంతేకాదు ఈ నీటికి వ్యాధులను నయం చేసే ఔషధగుణాలున్నాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న నీటిలో ఉన్న ఔషధ గుణాలతో తాగిన వారికి వ్యాధులు నయం అవుతాయట.
ఈ మహాదేవుడి ఆలయంలోని మిస్టరీని చేధించడానికి సైంటిస్టులు చాలా ప్రయాసపడుతున్నారు. గుడి గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆలయాన్ని మలబార్ దేవస్వం బోర్డు నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరూ భక్తి, ధ్యానంతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి