Mystery Temple: ఈ ఆలయంలో విగ్రహం నుంచి కన్నీరు వస్తే.. రానున్న సంక్షోభానికి సంకేతమట.. సైన్స్ కి అందని మిస్టరీ..
వజ్రేశ్వరి దేవిని స్థానికులు కంగ్రా దేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిది. భక్తులు దూరం నుంచే ఈ ఆలయంలోని బంగారు కలశాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేని రహస్యం ఉందని.. భక్తులు దీనిని అమ్మవారి అద్భుతంగా భావిస్తారు. కాంగ్రాలోని వజ్రేశ్వరి దేవి ఆలయంలో కాల భైరవుని విగ్రహం కూడా ఉంది. పురాణాల ప్రకారం, చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు ఈ భైరవ విగ్రహం కళ్ల నుండి కన్నీరు కారడం ప్రారంభమవుతుందని నమ్ముతారు.
మన దేశంలో అనేక రహస్య ఆలయాలున్నాయి. కొన్ని మిస్టరీలను నేటికీ ఛేదించలేకపోయారు. అలాంటి మిస్టరీ ఆలయం హిమాచల్‌లోని ప్రసిద్ధ శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయం ధర్మశాల నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నాగర్‌కోట్ పట్టణంలోని కాంగ్రాలో ఉంది. పార్వతి దేవి ప్రసిద్ధ ఆలయంగా ఖ్యాతిగాంచింది. తొమ్మిది పుణ్యక్షేత్రాలలో ఒకటి. అంతేకాదు శక్తి పీఠాల్లో ఒకటి. వజ్రేశ్వరి దేవిని స్థానికులు కంగ్రా దేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిది. భక్తులు దూరం నుంచే ఈ ఆలయంలోని బంగారు కలశాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేని రహస్యం ఉందని.. భక్తులు దీనిని అమ్మవారి అద్భుతంగా భావిస్తారు.
విగ్రహం నుండి కన్నీరు
కాంగ్రాలోని వజ్రేశ్వరి దేవి ఆలయంలో కాల భైరవుని విగ్రహం కూడా ఉంది. పురాణాల ప్రకారం, చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు ఈ భైరవ విగ్రహం కళ్ల నుండి కన్నీరు కారడం ప్రారంభమవుతుందని నమ్ముతారు. విగ్రహం నుండి కన్నీళ్లు రావడం చూసిన వెంటనే ఆలయ పూజారి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేక పూజలను చేస్తారు. ఈ కాల భైరవ విగ్రహం సుమారు ఐదు వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. భైరవస్వామి కన్నీళ్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు.
శక్తి పీఠాల్లో ఒకటి.. సతీదేవి ఎడమ రొమ్ము ఉన్న క్షేత్రం
పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి నిర్వహించిన యాగానికి తనను , తన భర్త శివుడిని ఆహ్వానించకపోవడం అవమానంగా భావించి అదే యాగం జరుగుతున్న అగ్నిలో దూకి తనను తాను దహనం చేసుకుంది. అనంతరం శివయ్య తన భార్య సతీదేవి మృత దేహాన్ని భుజంపై వేసుకుని మోస్తూ విశ్వం చుట్టూ తిరుగుతుండగా.. శ్రీ విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించాడు. అప్పుడు ఆమె శరీర భాగాలు భూమిమీద రకరకాల ప్రదేశాల్లో పడ్డాయి. సతీదేవి శరీర భాగం ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠం ఏర్పడింది. ఇలా సతి ఎడమ రొమ్ము పడిపోయిన ప్రదేశం వజ్రేశ్వరి ఆలయం. కాంగ్రా మాయి పేరుతో పూజించబడుతుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..