సుఖ సంతోషాలతో జీవించాలంటే.. మనిషికంటూ ఓ లక్ష్యం ఉండాలి.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జీవితానికి సంబంధించిన ఏ రంగంలోనైనా విజయం సాధించాలి. అయితే దైర్యం లేకుండా యుద్ధంలో విజయం సాధించలేము లేదా సంతోషాన్ని పొందలేము. జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో ఒక వ్యక్తికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందంటే.. ఆది అతని ధైర్యం. ధైర్యం అనేది ఒక విధమైన ఆలోచన.. దైర్యం మది తలపులు తడితే.. వెంటనే.. మిమ్మల్ని ఓటమి వదిలి విజయం వైపు పయనించేలా చేస్తుంది.
జీవితానికి సంబంధించిన ఏదైనా నిజం లేదా తప్పును అంగీకరించడానికి ధైర్యం కూడా అవసరం. ధైర్యం లేని వారి వద్ద ఉన్న జ్ఞానం వల్ల ఫలితం ఉండదు. ధైర్యం అనేది సానుకూల శక్తి, దీని సహాయంతో ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకుంటాడు. చెడు సమయాల్లో ధైర్యం కష్ట సమయంలో మంచి ఆలోచనను ఇస్తుంది. లక్ష్యం నుండి తప్పుకోనివ్వదు. శాంతిని కలిగి ఉండటానికి లేదా ఇతరుల తప్పును క్షమించడానికి ధైర్యం అవసరం. చరిత్రలో నిలిచిన మహానుభావులందరూ తమ తమ రంగాలలో ఈ ధైర్యసాహసాలను ప్రదర్శించడం వలనే.. నేటికీ యావత్ ప్రపంచం గుర్తుకు తెచ్చుకుంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)