Bonalu 2022: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునుంచే అమ్మవారి ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. .ఉదయం అమ్మవారికి అభిషేకం, ధ్వజారోహణ, శిఖర పూజ నిర్వహించారు. పండుగ వాతావరణంలో మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభమయ్యాయి. మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు బంగారు బోనంతో బోనం సమర్పించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమంలోమంత్రి తలసాని తీన్మార్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు అలరించాయి. ఈ నెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఈ నెల 17వ తేదీన నిర్వహించే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ అధికారులు. @YadavTalasani pic.twitter.com/sIVxNtunzb
— Namasthe Telangana (@ntdailyonline) July 13, 2022
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..