
చాలా మందికి రాత్రిలో అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని బాధ పెడతాయి.. భయ పెడతాయి. అయితే కలలో కనిపించే కొన్ని సంఘటనలు.. భవిష్యత్తులో దేని గురించో ఒక విషయాన్ని చెప్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ క్రమంలోనే చాలా మందికి కలలో దెయ్యాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీంతో నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. లేదా నిద్రలో అరవడం.. శరీరంలోని కాళ్లూ, చేతులు కదపడం వంటివి చేస్తారు. కొన్ని కలలు ఉదయం వరకూ గుర్తుండి పోతాయి. దీంతో చాలా భయ పడి పోతూ ఉంటారు. ఏం చేయాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొంత మందికి దెయ్యాలను అస్సలు పట్టించుకోరు. మరికొంత మంది మాత్రం బాగా నమ్ముతారు. ఎవరి నమ్మకాలు వాళ్లకున్నా.. డ్రీమ్ సైన్స్ ప్రకారం మాత్రం.. కలలో దెయ్యాలు కనిపిస్తే అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
మీకు తరచూ పీడ కలలు కనిపిస్తూ ఉంటే కనుక.. మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే.. దెయ్యాల కలలు, పీడ కలలు వంటివి వస్తూ ఉంటాయి.
మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోనైనప్పుడు లేదా మిమ్మల్ని ఎవరైనా బాధించినప్పుడు ఒక్కోసారి భావోద్వేగానికి లోనవుతారు. ఇలా ఎక్కువగా బాధ పడటం వల్ల కూడా పీడ కలలు, దెయ్యాలకు సంబంధించిన కలలు రావచ్చు.
కలలో మీపై ఒక దెయ్యం దాడి చేసినట్టు కల వస్తే.. మీరు ఏదో సాధించకుండా అడ్డుపడుందని.. మనస్సులో ఉందని కల సూచించినట్టు. అంతే కాకుండా మీరు విజయానికి దూరం అవుతారని కూడా అర్థం. అలాగే మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు కూడా దెయ్యం కలలు వస్తాయి.
మీరు ఎక్కువగా దెయ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటే.. భయ పడుతూ ఉంటే మాత్రం.. నిజంగానే మీ జీవితంపై పక్కా ప్రభావం పడుతుంది. ఎందుకంటే మీరు ఏం చూసినా భయ పడుతూ ఉంటారు. చీకట్లో కూడా వెళ్లరు. మీరు ఒంటరిగా వెళ్లాలంటే భయపడి పోతారు. దీని వల్ల మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది.