Pongal Festival
హిందూ మతంలో మకర సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు మకర సంక్రాంతి తర్వాత ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. పుష్య మాసం తర్వాత శుభ కార్యాలు కూడా ప్రారంభమవుతాయి. అయితే మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అంతేకాదు జీవితంలో సమస్యలు పెరుగుతాయి.
మకర సంక్రాంతి తేదీ
వేద పంచాంగం ప్రకారం జనవరి 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ఉదయం 9.03 గంటలకు ప్రవేశించనున్నాడు.
మకర సంక్రాంతి రోజున ఏమి చేయకూడదు?
- మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా పొరపాటున కూడా ఆహారం తీసుకోకండి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అపరిశుభ్రంగా మారి విషపూరితంగా మారుతుందని నమ్ముతారు.
- మకర సంక్రాంతి రోజున స్నానానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజు పొరపాటున కూడా నూనె దానం చేయకూడదు. మకర సంక్రాంతి రోజున నూనె దానం చేయడం అశుభం. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలు, ప్రతికూలతలు ఇంట్లోకి వస్తాయని నమ్ముతారు.
- అంతేకాదు మకర సంక్రాంతి రోజున తెల్ల బియ్యం, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయవద్దు
- మకర సంక్రాంతి రోజున తామసిక ఆహారం లేదా మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రతికూలత వస్తుంది. ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది.
- మకర సంక్రాంతి రోజున ఇంటి వచ్చిన పేదలకు, బ్రహ్మనులకు .. ఆకలి అన్నవారికి ఏదైనా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళనివ్వకండి.
- అంతేకాదు ఎవరిని పొరపాటున కూడా అవమానించవద్దు. ఈ విధంగా చేసిన వారు పాపానికి పాల్పడినట్లు నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.