Mahabharat: దుర్యోధనుడు అంతిమ సమయంలో శ్రీ కృష్ణుడికి 3 వేళ్లు ఎందుకు చూపించాడో తెలుసా..!

మహాభారతంలో దుర్యోధనుడు యుద్ధంలో భీముడి చేతిలో ఓడిపోయి నేలపై పడి.. తన చివరి ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు తాను చేసిన తప్పులను గ్రహించడం ప్రారంభించాడు. అప్పుడు అతను శ్రీ కృష్ణుడి వైపు మూడు వేళ్లు చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరగా వెళ్లి ఏమి చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. ఈ సమయంలో దుర్యోధనుడు మూడు వేళ్ళు చూపించి ఏమి చెప్పాడు.. కృష్ణుడు రెండు వేళ్లు చూపిస్తూ చెప్పిన సమాధానం ఏమిటి? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలుసుకుందాం.

Mahabharat: దుర్యోధనుడు అంతిమ సమయంలో శ్రీ కృష్ణుడికి 3 వేళ్లు ఎందుకు చూపించాడో తెలుసా..!
Mahabharata Story

Updated on: Jul 30, 2025 | 11:54 AM

మహాభారత యుద్ధం చివరి దశకి చేరుకుంది. దుర్యోధనుడి గర్వం భంగం అయింది. తన వైపు ఉన్న భీష్మ ద్రోణ, కర్ణ, సైన్యాన్ని చూసుకుని గెలుపు తనదే అని భావించి చాలా గర్వ పడిన దుర్యోధనుడు ఒక్కడే చావు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. యుద్ధం వద్దు అని విదురుడు వంటి వారు చెప్పినా.. పాండవులకు ఐదు గ్రామాలను ఇచ్చినా చాలు అని కోరినా.. దుర్యోధనుడు ఎవరి మాటని వినడానికి సిద్ధ పడలేదు. శాంతి మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు. అందుకు ఫలితంగా కురు పితామహుడు, ద్రోణుడు వంటి గురువు వంటి వారితో పాటు తన తమ్ముళ్ళను సైతం కోల్పోయాడు. చివరికి తాను భీముడి గదా దాడికి గాయపడి నేలపై పడి ఉన్నాడు. మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు పదే పదే శ్రీకృష్ణుడి వైపు మూడు వేలు చూపించడం ప్రారంభించాడు. పాండవులకు మద్దతు ఇచ్చిన శ్రీ కృష్ణుడి వైపు ఇలా మూడు వెళ్ళు ఎందుకు చూపించాడు.. మహాభారతంలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికరమైన కథను గురించి తెలుసుకుందాం.

శ్రీ కృష్ణుడికి మూడు వేళ్లు చూపించిన దుర్యోధనుడు

మహాభారతంలో అంతిమంగా దుర్యోధనుడికి, భీముడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. అప్పుడు భీముడి గద దెబ్బకు దుర్యోధనుడు రక్తంతో తడిసిపోయాడు. దుర్యోధనుడు మరణం అంచుకు చేరుకున్నాడు. అప్పుడు అతను శ్రీ కృష్ణుడి వైపు చూస్తూ మూడు వేళ్లు పైకెత్తి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. శ్రీ కృష్ణుడు దుర్యోధనుడిని చూసి.. అతని దగ్గరగా వెళ్లి అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు చివరి క్షణంలో తాను చేసిన తప్పుల గురించి మాట్లాడాడు.

దుర్యోధనుడు చేసిన మొదటి తప్పు ఏమిటి?

మహాభారతంలో తాను మూడు తప్పులు చేశానని దుర్యోధనుడు శ్రీ కృష్ణుడికి చెప్పాడు. అందుకే యుద్ధంలో గెలవలేకపోయానని.. ఇప్పుడు తాను మృత్యు ఒడిలో చేరుకోవడానికి రెడీ అవుతున్నానని చెప్పాడు. ఆ తప్పులు చేయకపోయి ఉంటే తనకే విజయం ఖచ్చితంగా దక్కేదని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు తాను చేసిన మొదటి తప్పుగా ఏమి చెప్పాడంటే.. తాను నారాయణుడిని ఎంచుకోలేదు.. నారాయణ సైన్యాన్ని ఎంచుకుని తప్పు చేశానని చెప్పాడు. తాను నారాయణుడు అంటే శ్రీ కృష్ణుడు ఎంచుకుని ఉంటే.. తాను యుద్ధం గెలిచి ఉండేవాడినని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

రెండవ తప్పు ఏమిటంటే..

నేను చేసిన రెండవ తప్పు ఏమిటంటే.. నా తల్లి గాంధారి పదే పదే చెప్పింది.. నన్ను తన ముందుకు నగ్నంగా నిలబడమని.. అయితే అమ్మ మాట వినకుండా.. నేను నడుముకి దుస్తులు ధరించి తల్లి దగ్గరకు వెళ్ళాను. ఒకవేళ నేను కనుక అలా నడుముకి బట్ట ధరించి వెళ్ళకపోతే.. తనని ఏ యోధుడి చంప లేకపోయేవాడని.. ఎవరు తనపై దాడిచేసినా తన శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపేది కాదు. ఎవరూ నన్ను ఓడించలేకపోయేవారని చెప్పారు.

మూడవ తప్పు ఏమింటే

దుర్యోధనుడు చివరిగా తన మూడో తప్పు గురించి చెప్పాడు. నేను చేసిన మూడవ, చివరి తప్పు ఏమిటంటే.. నేను యుద్ధానికి చివరిగా వెళ్ళానని.. అయితే నేను మొదట యుద్ధానికి వెళ్లి ఉంటే.. నా సోదరులు, బంధువుల ప్రాణాలను కాపాడి ఉండే వాడినని దుర్యోధనుడు చెప్పాడు.

శ్రీ కృష్ణుడు రెండు వెళ్ళు చూపిస్తూ ఏమి బదులిచ్చాడంటే..

దుర్యోధనుడు తాను చేసిన తప్పుల గురించి చెప్పగానే.. శ్రీ కృష్ణుడు.. రెండు వేళ్ళు చూపిస్తూ బదులిచ్చాడు. దుర్యోధనుడికి ఓటమికి కారణం శ్రీ కృష్ణుడు వివరిస్తూ.. నీ ఓటమికి ప్రధాన కారణం అధర్మ మార్గంలో నడవడం అయితే.. రెండో కారణం.. మీ ఇంటి కోడలైన ద్రౌపది వస్త్రాపహరణం చేయడమే అని చెప్పాడు. నువ్వు చేసిన తప్పుడు పనులే నీ విధిని రాశాయి. నీ ముత్యువుకి, నీ ఓటమికి కారణం అయ్యాయి.
అంతేకానీ నువ్వు చెప్పిన 3 తప్పుల వల్ల నువ్వు ఓడిపోలేదని శ్రీ కృష్ణుడు చెప్పాడు. నువ్వు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నందువల్లే ఓడిపోయావని దుర్యోధనుడికి చెప్పాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.