హిందూ సనాతన ధర్మంలో మహాశివరాత్రి పండుగను శివుని వివాహ వేడుకగా జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు తనను కోరి వరించిన అమ్మవారి పెళ్లి చేసుకుని గృహ జీవితంలోకి ప్రవేశించాడు. ఈ రోజున శివశక్తిని ఆరాధించడం ద్వారా భక్తుని కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్లికాని అమ్మాయిలు శివ రాత్రి రోజున వ్రతాన్ని ఆచరిస్తే.. వారి మనసుకు నచ్చిన భర్త లభిస్తారని, వివాహిత స్త్రీలు, పురుషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే.. ఆనందం, సుఖం, అదృష్టం, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారని నమ్ముతారు.
మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఆడపిల్లలు శివుని అనుగ్రహాన్ని పొందుతారు. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. పెళ్లికాని అమ్మాయి మహాశివరాత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే కోరుకున్న వరుడు లభిస్తాడని నమ్ముతారు. అదేవిధంగా పెళ్లికాని అబ్బాయి మహాశివరాత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే అతనికి సకల గుణగణాలు ఉన్న అమ్మాయి లభిస్తుంది.
ఈ సంవత్సరం 2024లో మహాశివరాత్రి ఫిబ్రవరి 8వ తేదీ శుక్రవారం జరుకోనున్నారు. ఈ శివ రాత్రిని హిందువులు చాలా పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఏదైనా ప్రత్యేక కోరికను నెరవేర్చుకోవడానికి శుభ సమయంలో శివుడిని పూజించాల్సి ఉంటుంది. ఈ రోజు నిశిత కాలం.. పూజ సమయం రాత్రి 12:07 నుండి 12:56 వరకు ఉంటుంది. మహాశివరాత్రి ఉపవాసం, పారణ సమయం మార్చి 9, 2024న ఉదయం 6:37 నుండి మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది.
మహాశివరాత్రి పర్వదినాన శివుడిని ఆరాధించడం అత్యంత ఫలవంతంగా భావిస్తారు. కేవలం ఉపవాసం, జలంతో అభిషేకంతోనే సంతోషించి.. భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తాడు అని విశ్వాసం. శివుడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తాడు. మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనిషి అకాల మరణ భయం నుండి విముక్తుడవుతాడు. వ్యాధుల నుండి రక్షింపబడతాడు. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే జంగమయ్య. మహాశివరాత్రి రోజున వివాహం కాని అమ్మాయి శివుడిని పూజిస్తే, ఆమె కోరుకున్న వరుడిని పొందుతుంది. శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు