సతీదేవి దంతం పడిన క్షేత్రం.. వినాయకుడు స్త్రీ రూపంలో దర్శనం.. ఈ మహామానిత్వ క్షేత్రం ఎక్కడంటే..

|

Jun 19, 2024 | 4:24 PM

సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్ని స్థనుమలయం అని పిలుస్తారు. ఈ ఆలయం శైవ, వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. స్థనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్ధం.. స్తను అంటే శివుడు, మాల్ అంటే విష్ణువు, ఆయ అంటే బ్రహ్మ. ఏడు అంతస్థుల అద్భుతమైన తెల్లని ఆలయ గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తూ సుచింద్రం ఆలయం దీని నిర్మాణ నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

సతీదేవి దంతం పడిన క్షేత్రం.. వినాయకుడు స్త్రీ రూపంలో దర్శనం.. ఈ మహామానిత్వ క్షేత్రం ఎక్కడంటే..
Suchindram Shakti Peet
Follow us on

సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాయి. అలాంటి శక్తి పీతాల్లో ఒకటి సుచింద్రం శక్తి పీఠం. ఇది హిందువులకు ప్రధాన మతపరమైన ప్రదేశం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉంది. సుచింద్రం శక్తి పీఠాన్ని తనుమలయన్ లేదా స్థనుమలయ దేవాలయం అని కూడా అంటారు. సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్ని స్థనుమలయం అని పిలుస్తారు. ఈ ఆలయం శైవ, వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. స్థనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్ధం.. స్తను అంటే శివుడు, మాల్ అంటే విష్ణువు, ఆయ అంటే బ్రహ్మ. ఏడు అంతస్థుల అద్భుతమైన తెల్లని ఆలయ గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తూ సుచింద్రం ఆలయం దీని నిర్మాణ నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

సతిదేవిపై దంతం ఇక్కడ పడినట్లు స్థల పురాణం

ఈ ఆలయం సతీదేవి 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో శక్తి నారాయణి రూపంలో పూజించబడుతోంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు, బట్టలు లేదా నగలు పడిపోయిన ప్రదేశాలు శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. వీటిని చాలా పవిత్రమైన తీర్థ స్థలాలుగా భావించి హిందువులు పూజిస్తారు.

పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞ కుండలో దూకి ప్రాణత్యాగం చేసింది. అప్పుడు శంకరుడు సతీదేవి మృతదేహాన్ని మోస్తూ విశ్వమంతా ప్రదక్షిణ చేస్తున్నాడు.. ఆ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృత దేహాన్ని ఖండించాడు. అప్పుడు 51 భాగాలుగా సతీదేవి శరీరం విభజించబడింది. ఇలా సతిదేవి పై దంతాలు పడిన ప్రదేశం సుచింద్రం శక్తి పీఠం అని నమ్మకం.

ఇవి కూడా చదవండి

గణపతికి స్త్రీ రూపంలో పూజ

విఘ్నాలకధి పతి గణపతిని రకరాకాల భంగిమలో పుజిస్తారు. అయితే ఈ శక్తిపీఠంలో అమ్మవారు నారాయణి రూపంలో పూజించబడుతుండగా.. గణపతి.. స్త్రీ రూపంలో అంటే విఘ్నేశ్వరి రూపంలో పూజిస్తారు. ఇలా గణపతిని స్త్రీ రూపంలో పూజించడం దేశంలో మరెక్కడా ఉండదు.

ఆలయ వాస్తుశిల్పం విశిష్టత

ఆలయంలో దాదాపు ముప్పై చిన్న, పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒక చోట విష్ణుమూర్తి అష్టధాతువు విగ్రహం ఉంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీత, రాముల విగ్రహం కుడి వైపున ప్రతిష్టించబడుతుంది. సమీపంలో గణేష్ ఆలయం.. దాని ముందు నవగ్రహ మండపం ఉంది. ఈ మంటపంలో తొమ్మిది గ్రహాల విగ్రహాలు అందంగా నిలబడి ఉన్నాయి. అలంగర్ మండపంలో నాలుగు సంగీత స్తంభాలు ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న అలంగార మండపంలో ఒకే గ్రానైట్‌తో చెక్కబడిన నాలుగు సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు మృదంగం, సితార, తంబురా, జలతరంగ వంటి విభిన్న వాయిద్యాల ధ్వనులను ఇస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.