Lord Ganesh: బుధవారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.. ఆ రోజున ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..

| Edited By: Ravi Kiran

Nov 24, 2021 | 6:17 AM

Lord Ganesh: సనాతన ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితమైనదిగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే.. ‘బుధవారం’ కూడా ఒక దేవుడికి అంకితం చేశారు.

Lord Ganesh: బుధవారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.. ఆ రోజున ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..
Ganesh
Follow us on

Lord Ganesh: సనాతన ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితమైనదిగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే.. ‘బుధవారం’ కూడా ఒక దేవుడికి అంకితం చేశారు. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడికి బుధవారం ప్రీతిపాత్రమైనదిగా పేర్కొంటారు. కైలాస పర్వతంపై మాత పార్వతి తన చేతులతో వినాయకుడిని సృష్టించిన రోజు బుధవారం అని నమ్ముతారు భక్తులు. అప్పటి నుండి ఈ రోజు గణపతికి చాలా ప్రీతికరమైనదని, ఈ రోజున గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు. గణపతిని శాస్త్రాలలో మొదట పూజలు అందుకేనే వాడిగా.. విజ్ఞాలను తొలగించి.. ప్రయోజనాలు చేకూర్చే దేవుడిగా అభివర్ణించారు. అందుకే ఆ గణేషుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం దొరకని పక్షంలో, బుధవారం నాడు గణపతిని పూజించడమే కాకుండా, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. అలా చేయడం ద్వారా ఎంతపెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతారట.

ఒక నిర్దిష్ట పనిలో విజయం కోసం..
మీరు ఏదైనా నిర్దిష్ట పనిలో విజయం సాధించాలనుకుంటే ప్రతి బుధవారం గణపతిని పూజించండి. గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. దీంతో మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు.

ఇబ్బందుల నుండి బయటపడటానికి..
మీ జీవితంలో కష్టాల పరంపర కొనసాగుతున్నట్లయితే.. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రతి బుధవారం గణపతికి 21 గరకపోచలను సమర్పించండి. దీంతో, మీ జీవితంలోని ప్రతి సంక్షోభం క్రమంగా తొలగిపోతుంది.

ఆర్థిక సమస్యలను ఉపశమనం పొందడానికి..
ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం పచ్చని పెసళ్లను దానం చేయండి. ఇది కాకుండా, ఒకటిన్నర పావ్ పెసళ్లను నీటిలో మరిగించి, నెయ్యి మరియు పంచదార కలిపి ఆవుకు తినిపించండి. దీని వల్ల కుటుంబ పురోభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి..
మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం నాడు నపుంసకులకు ఆకుపచ్చని దుస్తులను దానం చేయండి. ఇది కాకుండా, ప్రతి బుధవారం నాడు ఏదైనా అవసరం ఉన్నవారికి పెసళ్లను దానం చేయండి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, దైవ గ్రంధాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..