Success Mantra: స్వార్ధంతో ఏర్పడిన బంధాలకు లైఫ్ తక్కువ.. దురాశ వలన కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..

|

Nov 01, 2022 | 2:40 PM

కొన్నిసార్లు ఒక వ్యక్తి అత్యాశతో,  కొన్నిసార్లు తప్పని సరి పరిస్థితుల్లో ఇలా చేస్తాడు. దురాశ,  స్వార్థం మనలో లేనప్పుడు..  జ్ఞాన కిరణం అనే ఆలోచనతో మనిషి ముందుకు సాగుతాడు. జీవితంలో స్వార్థం వల్ల కలిగే నష్టాల గురించి..

Success Mantra: స్వార్ధంతో ఏర్పడిన బంధాలకు లైఫ్ తక్కువ.. దురాశ వలన కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
Success Mantra
Follow us on

జీవిత ప్రయాణంలో మనం చాలా మందిని కలుస్తాము. వారితో స్నేహం చేస్తాము. కొన్ని విషయాలను ఒకరికొకరు పంచుకుంటారు.  అయితే ఏ బంధమైనా కేవలం స్వార్ధం మీద ఏర్పడినప్పుడు ఆ సంబంధానికి బీటలు పడతాయి. బంధం వయస్సు తగ్గడం ప్రారంభమవుతుంది. చాల మంది జీవితంలో స్వార్ధ పూరిత మనుషులను చూసి ఉంటారు. కొంతమంది స్వార్థపూరితంగా మీ వద్దకు వస్తారు.. వారి అవసరం తీరగానే మిమ్మల్ని వదిలివేస్తారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి అత్యాశతో,  కొన్నిసార్లు తప్పని సరి పరిస్థితుల్లో ఇలా చేస్తాడు. దురాశ,  స్వార్థం మనలో లేనప్పుడు..  జ్ఞాన కిరణం అనే ఆలోచనతో మనిషి ముందుకు సాగుతాడు. జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే..  స్వార్థం వల్ల కలిగే నష్టాల గురించి పెద్దలు మహనీయులు చెప్పిన ఐదు విషయాల గురించి తెలుసుకుందాం.

  1. ఒక వ్యక్తి  స్వార్థం జ్ఞానము అనే కిరణంతో ఎక్కడ ముగుస్తుందో అక్కడ నుండి అతనిలోని మానవత్వం ప్రారంభమవుతుంది.
  2. జీవితంలో, తమ స్వార్థం కోసం ఇతరులకు హాని కలిగించే వ్యక్తులు తరచుగా తమ జీవితంలో దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
  3. జీవితంలో, తల్లిదండ్రులు, నిజమైన స్నేహితులు మాత్రమే మీకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరూ మీ నుండి ఆశించే రిలేషన్ లో ఎంతో కొంత  స్వార్థాన్ని కలిగి ఉంటారు.
  4. పండ్లు ఉన్న చెట్టుని పక్షులు ఆశ్రయిస్తాయి. తమ ఆకలి, అవసరం తీరిన తర్వాత ఆ పండ్ల చెట్టుని వదిలి వెళ్లిపోతాయి. అదే విధంగా అతిథులు ఇంట్లో సంతృప్తిగా భోజనం చేసి తమ అవసరం.. స్వార్ధం తీరిన అనంతరం ఆ ఇంటి నుండి వెళ్ళిపోతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ప్రతి స్నేహం వెనుక ఖచ్చితంగా కొంత స్వార్థం ఉంటుంది. ఎందుకంటే స్వార్థం లేకుండా ప్రజలు దేవుడిని పూజించరు. తన కోరిక నెరవేరిన తర్వాత దేవుడికి డబ్బులను, నైవేద్యాన్ని పెడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)