Success Mantra: జీవితంలో సంతోషం, దుఃఖం అనేవి ఎండ, నీడ లాంటివి అప్పుడప్పుడు మనిషి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. చెట్టు నుండి ఆకులు రాలిన అనంతరం మరోసారి కొత్త ఆకులు వస్తాయి. కొన్నిసార్లు కొందరికి జీవితంలో అలాంటి దుఃఖాలు వస్తాయి. వారు దుఃఖంతో కూడిన సుడిగుండంలో చిక్కుకుపోతారు. వారు కోరుకున్నప్పటికీ.. తమ దుఃఖం నుండి బయటపడలేరు. నిజమైన ఆనందం, దుఃఖం మానవ అనుభవం ఫలితం. జీవితానికి సంబంధించిన సుఖ దుఃఖాలకు సంబంధించిన ఆ విలువైన ఆలోచనల గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఇవి మీ జీవితాన్ని సంతోషపెట్టడంతో పాటు.. మీ దుఃఖాన్ని తగ్గిస్తుంది. తద్వారా జీవితం పట్ల విభిన్నమైన ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఏ వ్యక్తి జీవితంలోనైనా విచారం కలగడం సహజం. తద్వారా అతను తన జీవితానికి సంబంధించిన ఆనందం ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలడు.
జీవితంలో కొద్దికాలం పాటు దుఃఖం కలిగి ఉండటం కూడా మంచిది. ఎందుకంటే దుఃఖం నిజమైన స్నేహితుడిని, శత్రువును సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.
జీవితంలో రెండు రకాల దుఃఖాలు ఉంటాయి. ఒకటి ఏ మానవుడి కోరిక తీరకపోవడం.. రెండోది తన జీవితంలోని తీరని కోరికను కలిగి ఉండడం
మీ జీవితంలో మంచి రోజులు సంతోషాన్ని కలిగిస్తే.. చెడు సమయాలు మీ అనుభవంగా మారతాయి. సుఖ దుఃఖాలు రెండూ విజయవంతమైన జీవితాన్ని గడపడానికి రెండూ చాలా ముఖ్యం.
మనిషికి మంచి పనుల వల్ల సుఖం, దుష్కార్యాల వల్ల దుఃఖం కలుగుతాయి. ఈ విధంగా ఒక వ్యక్తి తాను ఏమిచేశాడో.. దాని ఫలితాన్ని పొందుతాడు. ఒకొక్కసారి తాను చేయనిదానిని కూడా శిక్షను అనుభవిస్తాడు.