
మనిషి అన్నాక ఏవోక కలలు వస్తూనే ఉంటాయి. కొందరికి గుర్తుంటాయి. కొందరికి గుర్తుండవు. కొందరికి మంచి కలలు వస్తే..ఇంకొందరికి చెడు కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే కలలను బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. చైత్ర నవరాత్రులు మార్చి 22 నుండి ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో మీకు కలలో సింహం, ఏనుగు, తల్లి దుర్గాదేవి కనిపిస్తే చాలా అర్థాలు ఉన్నాయి. ఈ కలలు శుభ, అశుభకరమైన సంఘటనల గురించి సమాచారాన్ని అందిస్తాయి. ఎలాంటి కలలు వస్తే మంచి జరుగుతుంది…ఏ కలలు వస్తే చెడు జరుగుతుందో తెలుసుకుందాం.
1. కలలో సింహం కనిపిస్తే:
మీకు కలలో సింహం కనిపిస్తే, దుర్గాదేవి త్వరలో మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటుందని అర్థం. మీరు దుర్గాదేవి ఆశీర్వాదం పొంది మీరు శత్రువుపై విజయం సాధించగలుగుతారు.
2. మీ కలలో ఏనుగు కనిపిస్తే:
మీకు కలలో ఏనుగు కనిపిస్తే దుర్గామాత త్వరలో మీ ఇంటికి వస్తుందని అర్థం. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని అర్థం.
3. కలలో అందమైన వస్తువులు కనిపించడం :
మీకు కలలో అందమైన వస్తువులు కనిపిస్తే దుర్గామాత అనుగ్రహం మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని బయటకు వెళ్లండి.
4. మీరు కోటను ప్రత్యక్షంగా చూస్తే:
మీకు కలలో కోట కనిపిస్తే, మీకు గౌరవం లభిస్తుందని అర్థం. మీ అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారని అర్థం. కుటుంబసమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందబోతున్నారని సంకేతం. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
5. కలలో పండ్లు తినడం :
మీ కలలో పండ్లు తినడం కనిపిస్తే, మీరు మీ అన్ని పనులలో విజయం సాధించబోతున్నారనడానికి చిహ్నం. మీరు ఏ పని చేసినా, ఆ పనులన్నీ విజయవంతం అవుతాయి.
6. కలలో నెమలిని చూడటం:
కలలో నెమలిని చూడటం శుభ సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే నెమలి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. కాబట్టి మీరు త్వరలోనే దైవిక ఆశీర్వాదం పొందుతారని అర్థం. ఆగిపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి.
7. కలలో కాకిని చూడటం:
కలలో కాకిని చూడటం వల్ల మీరు త్వరలో ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారని అర్థం. అయితే మీరు కలలో తూర్పు నుండి పడమరకు కాకి ఎగురుతున్నట్లు కనిపించినట్లయితే త్వరలో మీకు డబ్బు రాబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారడానికి ఇది సంకేతం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..