AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartika Pournami: అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. పౌర్ణమినాడు ఈ ఒక్క పని చేయండి..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి అత్యంత పవిత్రమైనది. ఈ రోజు శివ కేశవుల ఆరాధనకు చాలా ముఖ్యమైనది. ఈ శుభ దినాన ఉసిరి దీపాన్ని వెలిగించటం ద్వారా లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా, దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆయుష్షు, ఆరోగ్యం, అప్పుల బాధల నుంచి విముక్తిని ఇచ్చే ఈ ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి? పూజలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Kartika Pournami: అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. పౌర్ణమినాడు ఈ ఒక్క పని చేయండి..
Kartika Pournami Amla Deepam Benefits
Bhavani
|

Updated on: Nov 04, 2025 | 5:49 PM

Share

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, దీపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ దీపారాధన ధనం, ఆరోగ్యం ఇస్తుంది. ఈ దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధన స్థిరత్వం ఉంటుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉసిరి దీపం ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే, జాతకంలోని గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. సకల పాపాలు హరిస్తాయి.

ఉసిరి దీపం విధానం:

పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి.

ఉసిరి సిద్ధం: పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగాలి. వాటిని మధ్యలో కోసి, లోపలి గుజ్జును తీసేసి, గిన్నెలా తయారుచేయాలి.

దీపారాధన: ఈ ఉసిరి గిన్నెల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. కొత్త దూది వత్తిని ఆ నూనెలో ముంచి, ఉసిరి గిన్నెల్లో వేసి దీపం వెలిగించండి.

స్థానం: ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసికోట దగ్గర పెట్టి పూజ చేయాలి. తులసికోట ముందు దీపం పెడితే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.

దీపం ఆరిపోయే వరకు దానిని కదపకుండా చూడండి. పూజ తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇవ్వండి.

చేయకూడని పొరపాట్లు:

ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు:

పగిలిన ఉసిరి: పొరపాటున కూడా పగిలిన, దెబ్బతిన్న లేదా పురుగులు పట్టిన ఉసిరికాయలు వాడకూడదు. తాజా ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి. పువ్వొత్తిని నిలబెట్టేందుకు ఉసిరికాయను పైన కట్ చేయడం వంటివి చేయడం అపరాధం అని గుర్తించగలరు.

దీపాన్ని కదపడం: దీపం వెలిగించాక, అది పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఎట్టి పరిస్థితుల్లో కదపవద్దు. మధ్యలో ఆర్పకూడదు.

విసర్జన: దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్తబుట్టలో వేయకూడదు. మరుసటి రోజు ఉదయమే దానిని తీసుకుని, శుభ్రమైన నదిలో, పారే నీటిలో లేదా మట్టిలో విసర్జించండి.