TTD News: తిరుమల కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ. పది సంవత్సరాల అనంతరం తిరిగి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కళ్యాణమస్తు పేరుతో సామూహిక వివాహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ సంవత్సరం మే 28 మధ్యాహ్నం 12.34 నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు ముహూర్తాలు ఖరారు చేశారు. పాలకమండలిలో చర్చించి కళ్యాణమస్తు వేదికలను నిర్ణయిస్తామని టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు. కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా వివాహం చేసుకున్న వారికి మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Also Read: