శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ నేపధ్యంలో ఈ మఠంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక సేవా కార్యక్రమాలకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక సేవల్లో పాల్గొనేందుకు టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలకు గాను శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ , సుదర్శన హోమం , ఆశ్లేష-నాగ పూజ , పుట్టినరోజు పూజ వంటి వివిధ రకాల ప్రత్యేక సేవల్లో పాల్గోనలనుకునే భక్తులు ఆన్ లైన్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు అని ఆలయ సిబ్బంది పేర్కొంది.
ఈ కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో అత్యంత విశిష్టత కలిగిన మహాగణపతి హోమంను వినాయక చవితి పండగ సందర్భంగా సెప్టెంబర్ 7న ఉదయం 6 గం.టలకు నిర్వహించనున్నారు. అంతేకాదు శ్రీ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని 8వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించానున్నారు. ఇక సెప్టెంబర్ 17న పౌర్ణమి పూజను నిర్వహిస్తారు. ఆదిశంకర మఠంలో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని దైవానుగ్రహ పాత్రులు కావాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.
ఈ నేపధ్యంలో భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక పూజల కోసం ముందుగా బుక్ చేసుకునే వీలుని కల్పిస్తూ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. ఎవరైనా ఈ సేవలను బుకింగ్ చేసుకోవాలనుకున్నా.. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ లింక్‌ని క్లిక్ చేయండి. https://kaladyshankaramadomts.org/index.php/worldline/booking. ఏదైనా సహాయం కావాలంటే 8350903080 కి ఫోన్ చేయవచ్చు అని పేర్కొంది శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..