Lord Ganesha: గణనాధుని లడ్డు వేలం.. ఆంధ్ర, సీమలో టాప్.. 21 లక్షలు పలికిన గణపయ్య లడ్డు ఎక్కడంటే ..?

| Edited By: Surya Kala

Sep 30, 2023 | 12:42 PM

ఉమ్మడి కడప జిల్లాలో భాగమైన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయిచోటి నగరంలో ఈరోజు జరిగిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం వేలం పాట జరిగింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఎం ఎస్ ఆర్ కాలనీ వినాయకుని లడ్డు వేలం పాట అనుకోని రీతిగా 21 లక్షలకు చేరుకుంది.  స్వామి వారి ప్రసాదాన్ని రాయచోటికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ వైసీపీ నాయకులు మడితాటి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు.

Lord Ganesha: గణనాధుని లడ్డు వేలం.. ఆంధ్ర, సీమలో టాప్.. 21 లక్షలు పలికిన గణపయ్య లడ్డు ఎక్కడంటే ..?
Ganesh Laddu
Follow us on

వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో వినాయకునికి సమర్పించే లడ్డూ నిమజ్జనం ముందు వేసే వేలం పాటు కూడా అంతం ఉత్కంఠ భరితంగా అంత ఆనందంగా కోలాహలంగా నిర్వహిస్తూ ఉంటారు. మనకు ముఖ్యంగా లడ్డు వేలంపాట అంటే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డు . అయితే ఇప్పుడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటతోపాటు పోటీ పడుతున్నాయి వివిధ ప్రాంతాలలోని వినాయకుని లడ్డూ వేలం పాటలు . అందులో భాగంగానే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అంత కాకపోయినా దరిదాపు వరకు వచ్చి ఆంధ్ర , రాయలసీమలలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా 21 లక్షలకు లడ్డుని సొంతం చేసుకున్నాడు. రాయలసీమ ప్రాంతంలోని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి లోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ రెడ్డి.

ఉమ్మడి కడప జిల్లాలో భాగమైన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయిచోటి నగరంలో ఈరోజు జరిగిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం వేలం పాట జరిగింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఎం ఎస్ ఆర్ కాలనీ వినాయకుని లడ్డు వేలం పాట అనుకోని రీతిగా 21 లక్షలకు చేరుకుంది.  స్వామి వారి ప్రసాదాన్ని రాయచోటికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ వైసీపీ నాయకులు మడితాటి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు.

గత ఏడాది ఇక్కడే నిర్వహించిన లడ్డూను వేలంపాచలో ఐదు లక్షలకు దక్కించుకున్న శ్రీనివాసులు రెడ్డి ఈ ఏడాది భారీ స్దాయిలో వేలంలో పాల్గొని గత ఏడాది కంటే మూడింతలు ఎక్కువకు ఎం ఎస్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని పందిరిలో గణవాధుడి నైవేదం లడ్డూను 21 లక్షలకు దక్కీంచుకోవడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఇదే అత్యధికంగా వేలం నిర్వహించిన లడ్డుగా రికార్డు నెలకొల్పింది.

ఇవి కూడా చదవండి

శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఒక్క రాయిచోటి ప్రాంతంలోనే దాదాపు 30 వినాయక విగ్రహాలను దానం చేశారని, అంతేకాకుండా అన్ని పందిళ్లలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి గణనాధుని పట్ల తన భక్తి భావాలను చాటుకున్నారని స్థానికులు అన్నారు . 21 లక్షల రూపాయలకు లడ్డు వేలంపాటలో రికార్డు స్థాయిలో శ్రీనివాసులు రెడ్డి పాడుకోవడంతో స్థానిక వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..