
ప్రతి సంవత్సరం జన్మాష్టమికి ముందు, భక్తులు తమ ఇళ్లను అలంకరించుకోవడానికి, బాల శ్రీ కృష్ణుని పూజించడానికి సన్నాహాలు చేయడంలో బిజీగా ఉంటారు. ఊయల, వెన్న, చక్కెర మిఠాయి, వేణువు, నెమలి ఈక వంటి చిహ్నాలతో పాటు ఏదైనా వస్తువు ఈ శుభ సందర్భాన్ని దైవికంగా మార్చగలుగుతుంది అని అంటే అది కృష్ణ కమలం.
ఈ మొక్కలో శ్రీకృష్ణుడు స్వయంగా నివసిస్తున్నాడని నమ్ముతారు. అంతేకాదు ఈ కృష్ణ కమలం పువ్వులో మహాభారతం నుంచి విశ్వ సృష్టి వరకు దైవిక సంకేతాలు ఉన్నాయి. జన్మాష్టమికి ముందు ఇంట్లో ఈ మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆనందం, అదృష్టాన్ని ఇచ్చే మొక్కగా పరిగణించబడుతుంది.
కృష్ణ కమల (పాసిఫ్లోరా ఇన్కార్నాట) అనేది ఒక తీగ మొక్క ఇది ప్రత్యేక నిర్మాణంతో అందమైన నీలం-ఊదా రంగుల కలయికతో ఉండే అందమైన పువ్వులను ఇస్తుంది. ఈ మొక్క ప్రతి పొర, ప్రతి రేక కేవలం ఒక పువ్వు మాత్రమే కాదు.. శ్రీ కృష్ణుడి పాత్ర, ఆయన అవతారాలు, విశ్వ సృష్టి రహస్యానికి చిహ్నం అని నమ్ముతారు.
కృష్ణ కమలం ఉన్న ఇంట్లో కృష్ణుడి ఆశీస్సులు స్వయంచాలకంగా ఉంటాయని భక్తులు, అనేక మంది సాధువులు నమ్ముతారు. ఈ మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇది ఇంట్లో అదృష్టం, ప్రేమను పెంచుతుంది. ముఖ్యంగా జన్మాష్టమి సమయంలో ఇంటికి తీసుకురావడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఈశాన్య దిశలో నాటడం అత్యంత శుభప్రదం. అక్కడ ఆ మొక్క దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యులకు శాంతి, సామరస్యం మరియు శ్రేయస్సును తెస్తుంది.
కృష్ణ కమలాన్ని ఆయుర్వేదంలో మానసిక ప్రశాంతతను ఇచ్చే మొక్కగా కూడా పరిగణిస్తారు. దీని ఆకులను కొన్ని మందులలో ఉపయోగిస్తారు, ఇవి ఒత్తిడి, నిద్రలేమి, అశాంతిని తగ్గిస్తాయి. దీని ఉనికి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, అందంగా,సాత్వికంగా ఉంచుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.