AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరు డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం మంచిది కాదు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

ఉచిత సేవలు, ఉచిత సహాయాలు, దానధర్మాలకు స్వస్తి చెప్పడం మంచిది. కష్టార్జితాన్ని ఆచితూచి ఖర్చు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడానికి సమయం అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ మార్గాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, అవసరాల నుంచి బయటపడడం శ్రేయస్కరం.

Horoscope Today: వీరు డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం మంచిది కాదు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 04, 2025 | 6:49 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో లాభాలు గడిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రయత్నం చేయడం మీద పురోగతి ఆధారపడి ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుని పదోన్నతులు పొందడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. తెగించడం వల్ల, చొరవ చూపించడం వల్ల లాభం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ నైపుణ్యాలను ఉపయోగించుకుని ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించండి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

మీ సమర్థతను నిరూపించుకునేందుకు, మీకు అందవలసిన ప్రయోజనాలు అందేందుకు సమ యం బాగా అనుకూలంగా ఉంది. శుభ గ్రహాల అనుగ్రహాన్ని గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం చేసు కోవడం మంచిది. చిన్నా చితకా సమస్యలతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం ఉత్తమం. ఆరో గ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొద్ది ప్రయత్నంతో గరిష్ఠ స్థాయిలో లాభం పొందడానికి వీలైన గ్రహ సంచారం జరుగుతోంది. అను కూల సమయాన్ని వీలైనంతగా సద్వినియోగం  చేసుకోవడం మంచిది. ట్రేడింగులు, షేర్లు, స్పెక్యు లేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు అనుకూలంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మాట తీరును మెరుగుపరచుకోవడం చాలా అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

మీ ప్రజ్ఞావిశేషాలను, ప్రతిభా పాటవాలను ఉపయోగించుకోవడానికి ఇది బాగా అనుకూల సమ యం. అనేక మార్గాల్లో ఆదాయాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ప్రస్తుతం షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల వల్ల లాభాలు పొండానికి అవకాశం ఉంది. మిత్రులమీద, విలాసాల మీద డబ్బును నీళ్లలా ఖర్చు చేయడానికి ఇది సమయం కాదు. ఉద్యోగంలో కొద్ది ప్రయత్నంతో పదో న్నతులు లభించవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల ద్వారా లభ్ధి పొందడానికి అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

మీలోని సహజసిద్ధమైన వ్యాపార నైపుణ్యాలను ఉపయోగంలో పెట్టడానికి ఇది సరైన సమయం. శుభ గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడడం తగ్గించుకుని సొంత ఆలోచనలను వాడుకోవడం మంచిది. ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడం, ఆస్తిపాస్తులను పెంచుకోవడం, సొంత ఇంటిని ఏర్పాటు చేసుకో వడం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. కొద్ది ప్రయత్నంతో మీరు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

మీలోని పట్టుదలకు, పోరాటస్ఫూర్తికి ఇది పరీక్షా సమయం. మీకు బాకీలు, బకాయిల రూపేణా రావలసిన సొమ్మును కొద్ది పట్టదలతో రాబట్టుకోగలుగుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం మంచిది. శుభ గ్రహాల అనుకూలత కూడా బాగా ఎక్కువగా ఉంది. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజ యవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా మీ సత్తా వెలుగులోకి వస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

మీ మనసులోని కోరికలను, ఆశలను నెరవేర్చుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. గ్రహ బలం పూర్తిగా సహకరిస్తుంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు సైతం అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక బలం పెరగడానికి పరిస్థితులు బాగా అనుకూ లంగా ఉన్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపుల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాహసాలు, ప్రయోగాలు చేయడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొన్ని ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొద్ది ప్రయ త్నంతో ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఇతరత్రా పరిస్థితులన్నీ బాగా అనుకూలంగా ఉంటాయి. అందువల్ల సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆరోగ్యానికి కూడా లోటుండదు. లాభార్జనకు తగిన పెట్టుబడులు పెట్టడం, వృథా ఖర్చులు తగ్గిం చుకోవడం చాలా అవసరం. అదనపు ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొద్దిగా క్రియాశీలంగా వ్యవహరించడం వల్ల సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడం మీదా, అదనపు ఆదాయాన్ని దాచుకోవడం మీదా, ఖర్చులు తగ్గించుకోవడం మీదా శ్రద్ధ పెట్టాలి. నష్టదాయక వ్యవహారాలను దూరం పెట్టి, లాభదాయక వ్యవహారాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడం మంచిది. ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవడం వల్ల లాభం ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉచిత సేవలు, ఉచిత సహాయాలు, దానధర్మాలకు స్వస్తి చెప్పడం మంచిది. కష్టార్జితాన్ని ఆచితూచి ఖర్చు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడానికి సమయం అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ మార్గాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, అవసరాల నుంచి బయటపడడం శ్రేయస్కరం. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. మదుపులు, పెట్టుబడులకు ఇది సరైన కాలం.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!