శ్రీ కృష్ణుడిని బాలుడి రూపంలో కొలిచే ఆలయం ఎక్కడుందో తెలుసా.. 5000 ఏళ్ల చరిత్ర ఆ ఆలయం సొంతం

|

Feb 02, 2024 | 1:30 PM

గురువాయూరు ఆలయంలో చాలా అందమైన కృష్ణుడి విగ్రహం ప్రతిష్టించబడింది. నాలుగు చేతులతో భక్తులను కరుణిస్తున్నాడు. బాల గోపాలుడు సుదర్శన చక్రం, శంఖం, కమలం,  గదను నాలుగు చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. అయోధ్యలో రాముడు బాలుడి రూపంలో ఎలా పూజలను అందుకుంటున్నాడో.. అదే విధంగా ఈ  గురువాయూరప్పన్ గుడిలో  శ్రీకృష్ణుడు.. బాలుడి రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం  ప్రత్యేకత ఏమిటంటే..  ఇది 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.

శ్రీ కృష్ణుడిని బాలుడి రూపంలో కొలిచే ఆలయం ఎక్కడుందో తెలుసా.. 5000 ఏళ్ల చరిత్ర ఆ ఆలయం సొంతం
Guruvayurappan Temple
Follow us on

కేరళలోని అందాలకు మాత్రమే కాదు పుణ్య క్షేత్రాలకు కూడా ప్రసిద్ధి. ఈ రాష్ట్రంలో ప్రముఖ విష్ణు దేవాలయం గురువాయూరు ఆలయం. అత్యంత ధనిక దేవాలయం  కూడా.. శ్రీ కృష్ణుడు బాలుడి రూపంలో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కన్నయ్య గురువాయూరప్పన్‌గా ఖ్యాతిగాంచాడు. గురువాయూరు ఆలయంలో చాలా అందమైన కృష్ణుడి విగ్రహం ప్రతిష్టించబడింది. నాలుగు చేతులతో భక్తులను కరుణిస్తున్నాడు. బాల గోపాలుడు సుదర్శన చక్రం, శంఖం, కమలం,  గదను నాలుగు చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. అయోధ్యలో రాముడు బాలుడి రూపంలో ఎలా పూజలను అందుకుంటున్నాడో.. అదే విధంగా ఈ  గురువాయూరప్పన్ గుడిలో  శ్రీకృష్ణుడు.. బాలుడి రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం  ప్రత్యేకత ఏమిటంటే..  ఇది 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.

ఆలయ విశిష్టత ఏమిటంటే..

దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ ఆలయం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. గురువాయూరప్పన్ దర్శనం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తరచుగా వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధాని మోడీ తన బరువుకు సమానమైన తామర పువ్వులను బాల గోపాలుడికి సమర్పించారు.

కేరళలోని అతి ముఖ్యమైన.. ప్రసిద్ధ దేవాలయం గురువాయూరు దేవాలయం . ఇది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్ గ్రామంలో ఉంది. గురువాయూరు ఆలయం త్రిస్సూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ ద్వారక అని కూడా అంటారు.ఈ ఆలయాన్ని దేవతల గురువు బ్రహస్పతి,  వాయుదేవుడు కలిసి స్థాపించారని నమ్ముతారు. గురువాయూర్ అనేది మలయాళ పదం.. గురువు గాలి సహాయంతో స్థాపించిన భూమి అని అర్ధం. గురు, వాయు.. ఊరు అనే మూడు పదాలను కలిపి ఈ ఆలయానికి గురువాయూరు టెంపుల్ అని పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఆలయ గురించి పురాణ కథ

ఈ ఆలయం గురించి ఒక పురాణ కథ కూడా ఉంది. దీని ప్రకారం కలియుగం ప్రారంభంలో  వాయు దేవుడు ..  దేవతల గురువుగా పరిగణించబడే దేవగురు బృహస్పతిలు శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ విగ్రహం ద్వాపర యుగం నాటిది. అప్పుడు  వాయు దేవుడు  దేవగురు బృహస్పతి ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేవగురువు బృహస్పతి కోరిక మేరకు విశ్వకర్మ స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇరువురి పేర్లను కలిపి ఇక్కడ పూజలను అందుకునే కన్నయ్యను గురువాయూరప్పన్ అని పిలుస్తున్నారు. ఇక ఈ ప్రదేశానికి గురువాయూర్ అని పేరు పెట్టారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు