Tirupati: సుధా, మూర్తి దంపతులు భూరి విరాళం.. శ్రీవారికి బంగారు అభిషేక శంఖం.. కూర్మ పీఠం కానుక

| Edited By: Narender Vaitla

Jul 16, 2023 | 9:50 PM

అలనాటి రాజుల నుంచి స్వామివారి భక్తులు శ్రీవారిని సేవించి భూరి విరాళాలు ఇచ్చారన్న సంగతి తెలిసిందే. ఆ సంప్రదాయం నేటికీ భక్తులు కొనసాగిస్తూ.. ఆపద మొక్కుల వాడికి తమ శక్తి కొలది బంగారు, నగదు, భూమి వంటి కానుకలను అందజేస్తున్నారు. తాజాగా  ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి , సుధా మూర్తి దంపతులు శ్రీవారిని దర్శించుకుని భూరి కానుకలను సమర్పించారు. 

Tirupati: సుధా, మూర్తి దంపతులు భూరి విరాళం.. శ్రీవారికి బంగారు అభిషేక శంఖం.. కూర్మ పీఠం కానుక
Golden Abhisheka Shankam
Follow us on

కోరి కొలిస్తే కోరికలు తీర్చే దైవం.. స్వామి కరుణించు అంటూ మనసారా కోరితే భక్తుల కష్టాలను తీర్చే ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీ తో ఉంటుంది. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి సామాన్యులు, రాజకీయనేతలు, సెలబ్రెటీలు, దేశ విదేశాల నుంచి పోటెత్తుతారు. అలనాటి రాజుల నుంచి స్వామివారి భక్తులు శ్రీవారిని సేవించి భూరి విరాళాలు ఇచ్చారన్న సంగతి తెలిసిందే. ఆ సంప్రదాయం నేటికీ భక్తులు కొనసాగిస్తూ.. ఆపద మొక్కుల వాడికి తమ శక్తి కొలది బంగారు, నగదు, భూమి వంటి కానుకలను అందజేస్తున్నారు. తాజాగా  ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి , సుధా మూర్తి దంపతులు శ్రీవారిని దర్శించుకుని భూరి కానుకలను సమర్పించారు.

తిరుమల శ్రీవారికి రూ. 1.25 కోట్ల విలువ చేసే 2 కిలోల బంగారు పూజా సామగ్రిని ఇన్ఫోసిస్ అధినేత  నారాయణమూర్తి దంపతులు విరాళంగా ఇచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల కైంకర్యాలకు వినియోగించే బంగారు అభిషేక శంఖం, కూర్మ పీఠాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా నారాయణమూర్తి దంపతులను ఈఓ ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ రోజు ఉదయం సుధా మూర్తి దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని‌ దర్శించుకున్నారు. స్వామివారి తీర్ధ ప్రసాదాలను తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..