Diamond Ganesh: ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్ర గణేషుడు.. ఎవరి వద్ద.. ఎక్కడ ఉందో తెలుసా..
సిద్ధి, బుద్ధి ప్రదాత.. విజ్ఞాలను హరించే విఘ్నేశ్వరుడు.. ఆ తత్వం ఎంత చెప్పుకున్నా మనం అవగతం చేసుకున్నది గోరంత..!అయితే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమాండ్ గణేషుడి విగ్రహం సూరత్‌లో ఉంది.
ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ.. అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించినట్లు.. మనం మనసు పెట్టి ప్రార్థిస్తే అన్నింటిలో దేవుడు రూపం కనిపిస్తుంది. కావలసిందల్లా విశ్వాసం. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మీకు ఒక అరుదైన గణపతిని చూద్దాం. డైమండ్ సిటీ సూరత్‌లో ఈ గణపయ్యను చూడవచ్చు. సూరత్ లో వజ్రాల వ్యాపారం, వజ్రాల పాలిషింగ్ చాలా ఎక్కువ. ప్రపంచంలోనే వజ్రాల పాలిషింగ్, వ్యాపారాల్లో ప్రత్యేకత సాధించింది. అందుకే సూరత్ ని డైమండ్ సిటీ అంటారు. ఈ వజ్రాన్ని సూరత్‌లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ బెల్జియం నుంచి తీసుకువచ్చారు. 182.53 క్యారెట్ల వజ్రంలో గణేశుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది. బెల్జియం వజ్రాల గనిలో నుండి బయటకు వచ్చిన ఈ వజ్రంలో గణేష్ తొండం, చేతులు, కళ్ళు, కాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి.
దీని బరువు 36.50 గ్రాములు. డైమండ్ ఉంది 48 mm అధిక, 32 mm వెడల్పు, మందపాటి 20 mm. డైమండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వజ్రం విలువ సుమారు రూ. 600 కోట్లు ఉండవచ్చని అంచనా. కోహినూర్ వజ్రాల కంటే చాలా విలువైనదని.. అందుకే ఈ వజ్రంను అమ్మకానికి పెట్టడం లేదని ఆ వ్యాపారి తెలిపాడు.
ఈ వినాయకుడికి తన ఇంట్లో ప్రత్యేక పూజిలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సాధారణ రోజుల్లో భద్రంగా పెట్టెలో ఉంచే ఈ వజ్రాన్ని గణేష్ చతుర్థి నాడు మాత్రమే పూజల కోసం బయటకు తీసుకొస్తామని అన్నారు. ఈ గణపతిని భక్తుల దర్శనం కోసం సిద్ధివినాయక్ ఆలయానికి కూడా తీసుకొస్తామని వెల్లడించారు ఆ వ్యాపారి.
Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..