AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: బీరువాలో ఈ వస్తువులు ఉంచితే.. ఇంట్లో కనక వర్షమే!

ప్రస్తుత కాలంలో ఆర్థిక సమస్యలు లేని కుటుంబం ఉండటం కష్టమే. డబ్బు లేకుండా ఈ కాలంలో జీవించడం చాలా కష్టం. కనీస అవసరాలకైనా డబ్బు కావాల్సిందే. మరి అలాంటి డబ్బు ఆదాయాన్ని పెంచుకోవడం చాలా మంచిది..

Vastu Tips: బీరువాలో ఈ వస్తువులు ఉంచితే.. ఇంట్లో కనక వర్షమే!
vastu tips
Chinni Enni
|

Updated on: Nov 15, 2024 | 5:02 PM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది డబ్బు మాత్రమే. డబ్బు ఉంటేనే ఏదన్నా కొనగలం. తినగలం.. అన్న రకంగా మారిపోయింది. డబ్బు ఉంటే సమాజంలో గౌరవం కూడా లబిస్తుంది. అయితే కొంత మంది ఎన్ని లక్షలు, వేలు సంపాదించినా డబ్బు మాత్రం చేతిలో అస్సలు నిలవదు. ఎంత సంపాదించినా డబ్బు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్ని సార్లు మనం సంపాదించిన దాని కంటే.. ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవకుండా.. డబ్బులు నిలవాలంటే ఇప్పుడు చెప్పే రెమిడీలు ఎంతో చక్కగా పని చేస్తాయి. ఐశ్వర్యం కలగాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం.. బీరువాలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం చాలా మంచిది. ఇవి ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. మరి బీరువాలో ఎలాంటి వస్తువులు ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ దిశలో పెట్టండి:

బీరువాను ఎలా పడితే ఆ దిక్కులో ఉంచకూడదు. ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అలాగే పడమర నైరుతి, దక్షిణ నైరుతి అని రెండు రాకలు ఉంటాయి. బీరువాను దక్షిణ నైరుతీలో ఉంచాలి. బీరువా తలుపులు తెరవగానే ఉత్తరం దిక్కును చూడాలి. ఉత్తరం దిక్కు అనేది కుబేరుడి స్థానం. ఈ దిక్కులో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది.

ఇది అస్సలు పెట్టకండి:

చాలా మంది బీరువాలో తెలిసీ తెలియక ఎర్రటి వస్త్రాన్ని ఉంచుతారు. ఇది చాలా పొరపాటు. ఎప్పుడైనా సరే బీరువాలో ఎర్రటి వస్త్రానికి బదులు తెల్లటి వస్త్రం పెడితే మంచిది. తెల్లటి వస్త్రం పెట్టడం వల్ల మంచి శ్రేయస్సు కలుగుతుంది.

వట్టివేరు:

లక్ష్మీ దేవికి వట్టి వేరు అన్నా చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. లక్ష్మీ దేవికి వట్టివేరు కలిపిన నీటితో అభిషేకం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది. అదే విధంగా విష్ణు మూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తూ ఉండండి. విష్ణు మూర్తికి ఇష్టమైన పచ్చ కర్పూరం, వట్టివేలును బీరువాలో ఉంచడం వల్ల.. ఆర్థిక కష్టాలు తొలగుతాయి. వెంటి పాత్రలో వట్టి వేరు ఉంచి బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదని.. ఆర్థిక సమస్యలన్నీ తీరతాయని పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ 5 సంపాదనలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
ఈ 5 సంపాదనలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు