Deeparadhana: ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
దీపారాధన చేయడం చాలా మంచిది. చీకటిని పాలద్రోసి.. వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించడం వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. దీపారాధనకు ఎలాంటి నూనెలు ఉపయోగిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం..
హిందూ సంప్రదాయం ప్రకారం దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒక దీపం వెలిగించిన ఎన్నో పాపాలు నాశనం అవుతాయని.. హిందూ శాస్త్రం చెబుతుంది. చీకటిని తొలగించి.. జీవితంలో వెలుగు నింపడంలో దీపం చాలా ముఖ్యం. కొంత మంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మరికొంత మంది కేవలం వారాల్లో ముఖ్యమైన రోజుల్లో మాత్రమే దేవుడిని ఆరాధిస్తారు. దీపారాధన చేయడానికి ఒక్కొక్కరు పలు రకాల ఆయిల్స్ లేదా నెయ్యిని ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యిని ఎక్కువగా దేవుడికి సంబంధించిన దీపారాధనలో వాడతారు. మరి ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవు నెయ్యి:
దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల చాలా మంచిదని ఎంతో మంది పండితులు చెబుతూ ఉంటారు. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, తమ ఆర్థిక సమస్యలు తొలగుతాయని చెబుతారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప, వేప నూనెలు దీపారాధనకు ఉపయోగిస్తే.. అనారోగ్య సమస్యలు తగ్గుతాయట.
ఇలా చేస్తే సకల సంపదలు:
ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప, వేప నూనె, ఆముదం వంటి వాటిని కలిపి 41 రోజుల పాటు దీపారాధన చేస్తే.. సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెతో శనివారం దీపారాధన చేయడం కూడా చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల శని దోషాలు తొలగి.. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఆముదం నూనెతో చేస్తే.. ఇంట్లో సమస్యలు తొలగడమే కాకుండా.. లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం కూడా చాలా మంచిది. ఎక్కువగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసేందుకే ఇష్ట పడుతూ ఉంటారు. అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో గొడవలు కూడా చాలా వరకు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి.
మల్లెపూల నూనె:
హనుమంతుడిని ఎక్కువగా ప్రసన్నం చేసుకోవాలంటే.. మల్లెపూల నూనెతో దీపారాధాన చేయడం మంచిది. ఈ నూనెతో దీపారాధన చేస్తే తప్పకుండా హనుమంతుడి రక్ష కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..