NTR District: ఈ గడ్డ.. దేవాలయాలకు అడ్డా.. ప్రతి 10 అడుగులకో టెంపుల్

సాధారణంగా ఏ ఊర్లో అయినా.. పట్టణాల్లో అయినా... దేవాలయాలు అక్కడ ఒకటి.. ఇక్కడ ఒకటి అన్నట్లుగా ఉంటాయి. కానీ.. జగ్గయ్యపేటలో మాత్రం ఎక్కడ చూసినా దేవాలయాలే దర్శనమిస్తాయి. అంతేకాదు.. అక్కడ వివిధ రకాల ఆలయాలు ఎంతో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అందుకే ఆ పట్టణం.. టెంపుల్ టౌన్‌గా పేరుగాంచింది.

NTR District: ఈ గడ్డ.. దేవాలయాలకు అడ్డా.. ప్రతి 10 అడుగులకో టెంపుల్
Muktyala Temple
Follow us
M Sivakumar

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 15, 2024 | 7:20 PM

ఆ పట్టణంలో ఎటు చూసినా.. దేవాలయాలే కనిపిస్తాయి.. ఏ వీధి చూసినా ఆలయ గోపురాలే దర్శనమిస్తాయి.. అక్కడ ఇప్పటికే పూర్వీకులు నిర్మించిన దేవస్థానాలు 100కి పైగా ఉంటే.. ఇప్పుడు కొత్తగా మరో 50కి పైగా దేవాలయాలు కొత్తగా నిర్మించారు. అంతటితో ఆగకుండా మరిన్ని ఆలయాలు నిర్మిస్తున్నారు. మరోవైపు.. శిధిలావస్థలో ఉన్న దేవాలయాలను సైతం కోట్ల రూపాయలతో పునర్నిర్మిస్తున్నారు. ఇంతకూ ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ గ్రామం మరేదో కాదు.. అది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేనటువంటి పూర్తిగా వెండితో నిర్మించిన సిల్వర్ టెంపుల్స్ కూడా జగ్గయ్యపేటలోనే ఉన్నాయి. టెంపుల్ సిటీగా పేరుగాంచిన జగ్గయ్యపేటలో పది అడుగులకు ఓ దేవాలయం ఉంది. అంతేకాదు.. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిన పలు ప్రాచీన దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు శివ, శైవ క్షేత్రాలతో పాటు ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా ఎక్కువే ఉన్నాయి.

మరోవైపు.. జగ్గయ్యపేటలో రామాలయాలు, సాయి మందిరాలు, దుర్గా మాతా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. స్మశానానికి సమీప ప్రాంతంలో కూడా దేవాలయాలు ప్రణమిళ్లుతున్నాయి. ఇక.. జగ్గయ్యపేటకు కూతవేటు దూరంలో ఉత్తర వాహినిగా కృష్ణా నది తీరాన ముక్త్యాలలో భవాని సమేత ముక్తేశ్వరస్వామి, వేదాద్రిలో పంచ నరసింహ క్షేత్రాలు, పగలు భక్తులు, రాత్రిళ్ళు నాగసర్పాలు పూజించే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి క్షేత్రం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ క్షేత్రం జగ్గయ్యపేటలో ఎంతో ప్రసిద్ధిగాంచాయి. మొత్తంగా ఎటు చూసినా దేవాలయాలతో దర్శనమిచ్చే.. జగ్గయ్యపేటను టెంపుల్ టౌన్‌ అని పిలవడం కరక్టే కదా…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి