పిల్లల దిష్టి ఎన్ని రకాలు? నివారణ ఏంటి? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
చిన్న పిల్లలను భగవంతుని స్వరూపాలుగా భావిస్తారు. కానీ, చిన్నారులు ఎక్కువగా అందంగా, చురుకుగా ఉంటే వారికి దిష్టి (చూపు దోషం) పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా పాలు తాగే పిల్లలు, నవ్వుతూ ఉండే బిడ్డలు, ఆరోగ్యంగా పెరుగుతున్న చిన్నారులకు దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. దిష్టికి సంబంధించిన విషయాలు, నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న పిల్లల ఆరోగ్యం కాపాడటం కోసం తల్లిదండ్రులు, పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్న పిల్లలను భగవంతుని స్వరూపాలుగా భావిస్తారు. కానీ, చిన్నారులు ఎక్కువగా అందంగా, చురుకుగా ఉంటే వారికి దిష్టి (చూపు దోషం) పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా పాలు తాగే పిల్లలు, నవ్వుతూ ఉండే బిడ్డలు, ఆరోగ్యంగా పెరుగుతున్న చిన్నారులకు దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అసలు పిల్లల దిష్టి అంటే ఏమిటి? ఎన్ని రకాలు ఉన్నాయి? నివారణ ఎలా చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల దిష్టి అంటే ఏమిటి?
ఇతరుల ఈర్ష్య, అతిగా మెచ్చుకోవడం లేదా ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల పిల్లల ఆరోగ్యం, మనస్సుపై పడే ప్రభావాన్ని దిష్టిగా భావిస్తారు. దీని వల్ల పిల్లలు అనారోగ్యం పాలవడం, ఏడుపు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని నమ్మకం.
పిల్లల దిష్టి రకాలు
మానవ దిష్టి (మనిషి చూపు) అతిగా మెచ్చుకోవడం, లోపల ఈర్ష్య భావనతో చూడడం వల్ల కలిగే దిష్టి. దీని వల్ల పిల్లల్లో అకారణంగా ఏడుపు, ఆకలి తగ్గడం, చిరాకు వంటి లక్షణాలు కనబడతాయి.
బంధువుల దిష్టి మనకు చాలా దగ్గర వాళ్ల నుంచే తెలియకుండానే దిష్టి పడుతుందని పెద్దలు అంటారు. దీంతో పిల్లలు తరచూ జబ్బులు, నిద్రలో ఉలికిపాటు లాంటివి చేస్తుంటారు.
దృష్టి దోషం (చూపు దోషం) అందం, తెలివి, ఆరోగ్యం చూసి వచ్చిన దిష్టి. దీంతో పిల్లల ముఖం వాడిపోవడం, అలసట, బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రతికూల శక్తుల ప్రభావం కొన్ని ప్రదేశాలు లేదా వ్యక్తుల వల్ల ప్రతికూల శక్తి అంటుకుపోవడం. దీని వల్ల పిల్లలు రాత్రివేళ ఏడుపు, భయంగా ప్రవర్తించడం లాంటివి చేస్తుంటారు.
పిల్లల దిష్టి నివారణ మార్గాలు:
1. దిష్టి తీయడం (సాంప్రదాయ పద్ధతి).. ఉప్పు, ఎండు మిరపకాయలు, ఆవాలు కలిపి పిల్ల చుట్టూ మూడు సార్లు తిప్పి కాల్చడం. 2. నల్ల దారం / నల్ల చుక్క.. పిల్ల చేతికి నల్ల దారం కట్టడం లేదా చెంపపై నల్ల చుక్క పెట్టడం దిష్టి నివారణగా భావిస్తారు. 3. దిష్టి బొమ్మ లేదా కంటి బొట్టు.. పిల్ల బట్టలపై లేదా గొలుసులో దిష్టి బొమ్మ పెట్టడం. 4. దేవుడి నామస్మరణ.. రోజూ పిల్లల మీద “ఓం నమః శివాయ”, హనుమాన్ చాలీసా, లేదా బాల గోపాల మంత్రం జపించడం శుభఫలితాలు ఇస్తుందని విశ్వాసిస్తారు. 5. ఉప్పు నీటితో స్నానం.. వారానికి ఒకసారి గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పిల్లలకు స్నానం చేయించడంతో దిష్టి పోతుందని పెద్దలు చెబుతారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల రక్షణలో తల్లిదండ్రుల శ్రద్ధే అసలైన కవచం. ప్రేమ, సంరక్షణతో పాటు మన సంప్రదాయాలను పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా పెరుగుతారని పెద్దల చెబుతుంటారు. దిష్టి అనేది సంప్రదాయ విశ్వాసం. అయితే, పిల్లలకు తరచూ జ్వరం, బరువు తగ్గడం, ఎక్కువగా ఏడుపు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సంప్రదాయం, వైద్యం రెండింటినీ సమతుల్యంగా పాటించడమే ఉత్తమమైన మార్గం.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
