క్రీస్తుపూర్వం రాజుల పరిపాలనలో రాజులు కప్పం శిస్తు కట్టించుకునేవారు ప్రజలతో..అంతే కాకుండా ఊడిగం చేయించుకునేవారు. అయితే గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోవడంతో ఊరు ఊరంతా పైసా పైసా వేసుకుని ఓ గుడిని నిర్మాణం చేశారట. ఆ వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, గుడి చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. కానీ అందులో దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గ్రామస్తుల వద్ద డబ్బులు లేక పోయేసరికి ఏం చేయాలో తెలియక, గ్రామ పెద్దలు కొంతమంది దేవుని విగ్రహం కోసం గ్రామాలలో వెతక సాగారు..అలా వెతుకుతున్న సమయంలో నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామ సమీపంలో ఓపాడు బడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించిందట..రాత్రిపూట ఆ విగ్రహాన్ని దొంగిలించి ఎడ్లబండ్లపై తీసుకువచ్చారట.. తీసుకువచ్చి ఊరు ప్రక్కనే ఉన్న చెరువులో దాచి ఉంచారట.
ఆ చెరువు పేరు కృష్ణమ్మ చెరువుగా పిలుస్తారు నేటికీ. ఇక దొంగతనం చేసి తీసుకువచ్చిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు గుర్తుపడతారేమో అన్న భయంతో గ్రామస్తులంతా కలిసి కృష్ణుని విగ్రహానికి వెండితో కోర మీసాలు చేయించి పెట్టారట. అలా మీసాలు పెట్టిన కృష్ణయ్య విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించారట..మీసాలు ఎందుకు పెట్టారట అంటే..ఆ గ్రామస్తులు వచ్చి విగ్రహాన్ని గుర్తుపట్టి దొంగతనం చేశారని అభియోగం మోపుతారనే భయంతోనే కృష్ణయ్యకు కోర మీసాలు పెట్టారట… అప్పటి నుండి ఈ గోపాలకృష్ణుని మీసాల కృష్ణుడిగా కొల్చుకుంటారట గ్రామస్తులంతా.
అంతేకాకుండా ఆనాడు ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నప్పుడు గుడిలో ఒక దీపాన్ని కూడా వెలిగించారట. దాన్ని నందా దీపం అని అంటారు.. ఆ దీపాన్ని ప్రతిష్టించిన నుండి ఇప్పటివరకు అలానే వెలగడం ఆ దేవుని మహిమే అని చెప్పుబుతున్నారు స్థానికులు..ఆ గుడి ముందు ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో నీరు ఎప్పుడూ ఎండిపోయిన దాఖలాలు కూడా లేవట. అందుకే ఈ మీసాల కృష్ణుడిని నిత్య పూజలతో కొలుస్తుంటారు భక్తులు.
ఈ కృష్ణయ్యను దర్శించు కోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా, సుదుర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ కృష్ణయ్యను మొక్కిన భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక్కడి మీసాల కృష్ణయ్య చల్లని చూపు కారణంగానే తమ గ్రామంలో పాడి పంటలతో పాటు ఊరు ఊరంతా సంతోషాలతో, పాడిపంట, పశువులతో సుభిక్షంగా ఉన్నామంటున్నారు. అంతేకాకుండా మీసాలు పెట్టడంతో మా ఊరికి కలిసివచ్చిందని గ్రామస్తులంతా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. మొత్తానికి ఈ గ్రామస్తులు ఒక చరిత్రని తిరగ రాశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ చరిత్ర చూసినా కృష్ణయ్యకు మీసాలు ఉండవు అనేది మాత్రం వాస్తవం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..